ఆ విషయంలో రాజమౌళి - ప్రశాంత్ నీల్ కూడా.. అనిల్ రావిపూడి ని చూసి నేర్చుకోవాల్సిందే..!
చాలా చాలా కామెడీగా చాలా రియలిస్టిక్ గా జనాలు నవ్వుకునే విధంగా ఈయన తెరకెక్కించే సినిమాలు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . చాలామంది జనాలు అనిల్ రావిపూడి సినిమాలని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . పగలంతా వర్క్స్ తో టెన్షన్స్ తో బిజీ బిజీ షెడ్యూల్స్ లో ఉండే జనాలకి కామెడీగా నవ్వుకునే సినిమాలు ఇంపార్టెంట్ . అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తాడు అనిల్ రావిపూడి అంటూ జనాలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
రీసెంట్గా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు . చాలా వెరైటీగా ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు అనిల్ రావిపూడి. ఈ కాన్సెప్ట్ కచ్చితంగా జనాలకు ఎక్కేస్తుంది అని.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు జనాలు . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ//" కేవలం ఈ సినిమాను 72 రోజుల్లోనే పూర్తి చేసినట్లు అని రావిపూడి చెప్పుకొచ్చారు". దీంతో ఈ సినిమాపై జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయడం ప్రారంభించారు . "అంతేకాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 72 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది అని ..ఎఫ్2 సినిమా 74 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు ".
అయితే రాజమౌళి , ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ లు అనిల్ రావిప్పుడిని చూసి నేర్చుకోవాలి అని ..అంత తక్కువ టైం కాకపోయినా సరే ఒక సంవత్సరంలోపైన సినిమాలను కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతున్నారు .మరి ముఖ్యంగా రాజమౌళి కేవలం మహేష్ బాబు లుక్స్ కోసం 365 రోజులు ఖర్చు చేయడం చాలా చాలా దారుణం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎంత పాన్ ఇండియా సినిమా అయినా సరే హీరోకి కూడా పర్సనల్ వర్క్స్ అంటూ ఉంటాయి అని.. ఒక సినిమా కోసమే మూడు నాలుగేళ్లు కష్టపడితే ఎలా..? అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు..!