కొంతమంది హీరోయిన్లు తమ క్రేజ్ తో సినిమాను హిట్ అయ్యేలా చేస్తారు.అలా ఈ హీరోయిన్ కూడా తన క్రేజ్ తో వరుస సినిమాలు చేసి హీరో కంటే ఎక్కువగా అభిమానులను అలరించింది.ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష కృష్ణన్.. త్రిష అప్పట్లో స్టార్ హీరోయిన్.. ఇప్పటికి కూడా చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్గా ఉంది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో సంక్రాంతికి ఎన్ని విడుదలయ్యాయి .. అందులో ఎన్ని హిట్లు కొట్టాయి అనేది ఇప్పుడు చూద్దాం..
సంక్రాంతి లక్కీ హీరోయిన్ గా త్రిష:
టాలీవుడ్ లో త్రిష నటించి మొదటిసారి సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా వర్షం.. ప్రభాస్, త్రిష కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ వర్షం. ఈ సినిమా 2004 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక అదే ఏడాది స్టార్ హీరోలైన చిరంజీవి నటించిన అంజి మూవీ విడుదలై అట్టర్ ప్లాఫ్ అయింది. అలాగే బాలకృష్ణ లక్ష్మీ నరసింహ ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన 2005 సంవత్సరంలో కూడా త్రిష నటించిన సినిమా విడుదలైంది.2005 సంక్రాంతి బరిలో జూనియర్ ఎన్టీఆర్ నా అల్లుడు, పవన్ కళ్యాణ్ బాలు, సుమంత్ ధన 51, సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఆ సంక్రాంతికి స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లను వెనక్కి నెట్టి సిద్ధార్థ్ త్రిష కాంబినేషన్లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకుంది. అలా త్రిష ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ కూడా పడింది. ఇక 2008లో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి సంక్రాంతి లక్కీ హీరోయిన్గా మారిపోయింది త్రిష 2008 సంక్రాంతి బరిలో బాలకృష్ణ ఒక్క మగాడు, సుమంత్ పౌరుడు, రవితేజ కృష్ణ మూవీలు రిలీజ్ అయ్యాయి.ఇక ఈ సినిమాల్లో ఒక్క మగాడు,పౌరుడు సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవ్వగా రవితేజ కృష్ణ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలా ఈ సినిమాలో కూడా రవితేజ సరసర త్రిష హీరోయిన్గా నటించింది. ఇక 2010లో త్రిష సంక్రాంతి బరిలో నిలిచిన నమో వెంకటేశాయ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.అలాగే 2012లో విడుదలైన బాడీగార్డ్ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలా ఇప్పటివరకు త్రిష టాలీవుడ్లో ఐదు సార్లు సంక్రాంతి బరిలో నిలిచింది.కానీ మూడుసార్లు బ్లాక్ బస్టర్ హిట్స్ రెండు సార్లు యావరేజ్ హిట్స్ ని అందుకుంది.అలా సంక్రాంతి లక్కీ హీరోయిన్గా త్రిష ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది