బిగ్ ప్లాన్ వేసిన శంకర్.. కానీ గేమ్ చేంజర్ హిట్ అయితేనే?

praveen
శంకర్ సినిమాల గ్రాండియర్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు! ఆయన సినిమాల ప్రమోషనల్ సమయంలో కంటెంట్ కంటే కూడా ఆయన గ్రాండియర్ గురించే ఎక్కువగా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. అయితే, మొట్ట మొదటి సారి తెలుగు సినిమా తీసిన శంకర్.. తన తీరుని మార్చుకున్నట్టు కనబడుతోంది. తాజాగా రిలీజైన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూస్తుంటే అది చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. శంకర్ గత చిత్రాలకు ఇది భిన్నంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక ఐఎఎస్ కు పొలిటిషయన్ కు మధ్య జరిగే కథ! అని శంకర్ చెప్పినట్లే.. ట్రైలర్ లో కథను కథనాన్ని కొంత మేర రివీల్ చేసినట్టు చాలా స్పష్టం అవుతోంది.
ఇప్పటి వరకు చూసుకుంటే... గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు నెటిజెన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ రాగా‌‌.. ట్రైలర్ కు పాజిటివ్ రిపోర్ట్ వస్తోంది. శంకర్ చెప్పినట్లు కొత్త కొత్త షాట్స్.. సాంగ్స్ లో ప్రయోగాలు ట్రైలర్ లో శాంపిల్ గా చూపించినట్టు కనబడుతోంది. వాస్తవానికి మూడేళ్ల నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవటం వలన.. గేమ్ ఛేంజర్ పై ఆడియన్స్ లో పెద్దగా అంచానాలు లేవని చెప్పుకోవాలి. అయితే విడుదలకు ముందు ట్రైలర్ హైప్ ను క్రియేట్ చేయడం వలన ఒక్కసారిగా ఈ సినిమా అంచనాలను పెంచేసింది. మరీ సినిమా ఏ మేరకు అంచానాలు అందుకుంటుందో చూడాలి.
ఏది ఏమైనా గేమ్ చెంజర్ సినిమా హిట్ కావడం అనేది హీరో రామ్ చరణ్ కంటే కూడా దర్శకుడు శంకర్ కి చాలా అవసరంగా కనబడుతోంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా శంకర్ ప్లాప్స్ ఇస్తూ వస్తున్నాడు. దాంతో ఈ సినిమా హిట్ కావడం అనేది శంకర్ కి చాలా అవసరంగా మారింది. మరోపక్క ఈ సంక్రాతి పండగకి వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఉండడంతో పబ్లిసిటీ విషయంలో ఈ సినిమా టాప్ ప్లేస్ లో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం బాలకృష్ణ డాకూ మహరాజ్ తో రావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సీజన్లో ముందు విడుదలవుతోన్న గేమ్ ఛేంజర్ పై ఆయా సినిమాలు ఎఫెక్ట్ ఎట్టా ఉండబోతోంది అనే విషయం ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని చాలా స్పష్టం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: