ఆ ఘనత సాధిస్తేనే డాకు మహారాజ్ మూవీ హిట్టు.. బాలయ్యపై భారీ భారమే మోపారుగా!

Reddy P Rajasekhar
బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య కెరీర్ లో గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది. కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఏకంగా 78 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
 
కర్ణాటక, ఓవర్సీస్ హక్కులు కలిపితే ఈ సినిమా బిజినెస్ ఏకంగా 100 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. బాలయ్యపై ఒక విధంగా భారీ భారమే మోపారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ భిన్నమైన కథాంశాలలో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. డాకు మహారాజ్ కలెక్షన్ల విషయంలో సైతం అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
డాకు మహారాజ్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. బాలయ్య సినిమా కాబట్టి ఏపీలో టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం మాత్రం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.
 
స్టార్ హీరో బాలయ్య క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతుండగా ఈ హీరో భిన్నమైన ప్రాజెక్ట్స్ కు ఓటేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సినిమాలలో రిపీట్ అవుతుండటం గమనార్హం. అయితే డాకు మహారాజ్ సినిమాలో మాత్రం బాలయ్య తనను ఎంపిక చేయలేదని దర్శకుడు బాబీ నన్ను ఎంపిక చేశారని ఆమె చెప్పుకొచ్చారు. డాకు మహారాజ్ సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: