2025 ఇది న్యూ ఇయర్ కాదు.. పాన్ ఇండియా ఇయర్..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తెలుగు దర్శకుడు మారుతి కాంబినేషన్లో వస్తున్న ది రాజాసాబ్ కూడా పాన్ ఇండియా మూవీ గానే తెర్కక్కుతుంది .. ఈ సినిమా కూడా 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకులు ముందుకు రానుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకుని క్రిష్ దర్శకత్వ ఘాటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాచురల్ స్టార్ నాని శ్రీనిధి శెట్టి కలిసి నటిస్తున్న హిట్ 3 సినిమాని కూడా దర్శకుడు శైలేశ్ కొలను పాన్ ఇండియా స్థాయిలో మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ , మొదటిసారిగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నాడు .. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చాలా వరకు పూర్తి చేశాడు .. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వల్ గా వస్తున్న అఖండ తాండవం 2 కూడా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో బోయపాటి ప్రళయతాండవం చూపించబోతున్నాడు .. ఈ సినిమా కూడా దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమాలే కాకుండా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. రిషభ్ శెట్టి హీరోగా తెరకెక్కిస్తున్న కాంతారా సిక్వెల్ కాంతారా ఫస్ట్ చాప్టర్ సినిమా కూడా అక్టోబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది .. ఇవే కాకుండా హనుమాన్ తర్వాత తేజ సబ్జా నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ మిరాయి కూడా పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇలా ఈ 2025లో ప్రతి నెల ఒక పాన్ ఇండియా సినిమాతో తెలుగు హీరోలు ఇండియన్ సినమాను షేక్ చేయడానికి రెడీగా ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Hrithik Roshan
-
karthikeya
-
kartikeya
-
manchu vishnu
-
Dussehra
-
Vijayadashami
-
teja
-
jyothi
-
February
-
Naga Chaitanya
-
september
-
CM
-
October
-
Sai Pallavi
-
Audience
-
Balakrishna
-
boyapati srinu
-
war
-
NTR
-
bollywood
-
Makar Sakranti
-
Indian
-
January
-
Darsakudu
-
Prabhas
-
kalyan
-
Heroine
-
GEUM
-
Ram Charan Teja
-
Director
-
Cinema
-
Nani
-
Telugu
-
Andhra Pradesh
-
Tollywood
-
India