"గేమ్ చేంజర్" ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరి నోట అదే మాట.. సినిమా రిజల్ట్ ఏంటో ముందే తెలిసిపోయిందిగా..!?
అయితే రీసెంట్ గా సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూడగానే మెగా ఫాన్స్ అసలు మొత్తం గల్లంతయినట్లే అనిపిస్తుంది. అసలు సినిమాలో కధ ఏంటి..? కంటెంట్ ఏంటి..? రాంచరణ్ ని ఎలా చూపించబోతున్నాడు..? రామ్ చరణ్ ఈ సినిమాని ఏ బేస్ తో ఒప్పుకున్నాడు..? అసలు ఈ సినిమాలో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఏంటి ..? కియరా.. అంజలి ఇద్దరిని కూడా డమ్మీలు చేసి చూపిస్తున్నారే..? ట్రైలర్లో ఇద్దరి వర్షెన్ చాలా తక్కువగా చూపించారు .
అసలు ఈ సినిమాలో హీరోయిన్స్ ని ఎందుకు పెట్టారు ..?ఒకటా రెండా నానా రకాలుగా సోషల్ మీడియాలో మీమ్‌స్ ట్రోల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ని త్రీ లుక్స్ లు చూపించడాన్ని తప్పుపడుతున్నారు జనాలు . డ్యూయల్ షేడ్ చేస్తేనే చూడలేం . ఇక త్రీ షర్ట్స్ లో ఎలా పాజిబిలిటీ అవుతుంది అనుకున్నావు ..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఒకపక్క బన్నీ ఫ్యాన్స్ ఏమో గేమ్ చేంజర్ సినిమాను ఫ్లాప్ చేస్తాం అంటూ ఓపెన్గానే చెబుతున్నా మూమెంట్లో.. శంకర్ ఇంత నెగ్లెజెన్సీగా ఎలా సినిమాను తెరకెక్కించారు అంటూ మండిపడుతున్నారు .
ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామందికి గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ నచ్చలేదు. అంతా నెగటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాకి సంబంధించిన టాక్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . మరి కొద్ది రోజుల్లోనే సినిమా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవుతుందా..? లేదా..? అన్నది పెద్ద డౌటే . అంతేకాదు దిల్ రాజు సినిమా కోసం ఉన్నదంతా ధారపోసాడు. ఆయన పెట్టిన డబ్బులు కనీసం సగమైన వస్తాయా..? అన్న రేంజ్ లో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు..!