ఆ "2" సినిమాలను కాపీ చేస్తేనే "గేమ్ చేంజర్".. రెండూ కూడా శంకర్ తెరకెక్కించినవే..!?
కొంతమంది జనాలు మాత్రం "అపరిచితుడు" సినిమాలా ఉండబోతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు . అయితే శంకర్ ఈ కామెంట్స్ విన్నాడో ..? ఏమో..? రెండు సినిమాలను మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు అంటూ జనాలు వెటకారంగా ట్రోల్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా "గేమ్ చేంజర్". ఈ సినిమా జనవరి 10వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా చాలా కష్టపడ్డాడు అంటూ కూడా బాగా వార్తలు వినిపించాయి .
అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ లుక్స్ చూసి చాలామంది షాక్ అయిపోతున్నారు. రామ్ చరణ్ 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు . అయితే రామ్ చరణ్ యాక్టింగ్ స్టైల్ బాగానే ఉన్నా ఎక్కడో శంకర్ డైరెక్షన్ మాత్రం తేడా కొడుతుంది అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ పరంగా " ఒకే ఒక్కడు" సినిమా అని.." నాటినెస్" పరంగా హీరోయిన్స్ లుక్స్ పరంగా 'అపరిచితుడు' సినిమాలా ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారు. ఇలా ఆయన తెరకెక్కించిన ఆ రెండు సినిమాలను మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు అన్న ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలోకి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా పై నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది..!