రామ్ చరణ్ కోసం ఆ హీరోని నెట్టేసారా.. శంకర్ ఏం చేశారంటే..?
ఇటీవల ఈ సినిమా రిలీజ్ ను లైకా ప్రొడక్షన్స్ వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాతకు పెద్ద రిలీఫ్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా పోస్ట్ పోన్ వెనుక పెద్దతతంగమే నడిపించారట ప్రముఖ డైరెక్టర్ శంకర్.
లైకా ప్రొడక్షన్స్ పై డైరెక్టర్ శంకర్ ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ సినిమాను సంక్రాంతి బరి నుంచి లాస్ట్ మినిట్లో తప్పించినట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్ లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్లో ఇండియన్ 2 సినిమా చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా లైకా తో ఇండియన్ 3 సినిమా చేయబోతున్నారు శంకర్.
ఇకపోతే దీని కంటే ముందే గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేసి హిట్టు కొట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.. తమిళంలో గేమ్ ఛేంజర్ సినిమా కి హైప్ లేదు. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు కూడా గేమ్ ఛేంజర్ ని తీసుకోలేదు. దీంతో శంకర్ లైకా ప్రొడక్షన్స్ తో మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్ మూవీ విడుదల ఆపేస్తే ఇండియన్ 3 ఫాస్ట్ గా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారట. అందుకే లైకా ప్రొడక్షన్స్ వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.