రామ్ చరణ్ కి రాజమౌళి వార్నింగ్.. అలా చేయొద్దంటూ..?

Pandrala Sravanthi
గ్లోబల్ హీరో రామ్ చరణ్ కి దర్శకధీరుడు రాజమౌళి వార్నింగ్ ఇవ్వడం ఏంటి..అసలు రామ్ చరణ్ కి రాజమౌళి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. నిజంగానే రాజమౌళి వార్నింగ్ ఇచ్చారా అంటే నిజమనే అంటున్నారు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని దగ్గరుండి చూసిన చాలామంది. అయితే తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. హైదరాబాదులోని ఏఎంబి మాల్ లో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి సినిమాలో నటించిన రామ్ చరణ్,దిల్ రాజు, శంకర్,అంజలి, శ్రీకాంత్,సముద్ర కని, సూర్య లు వచ్చారు. అలాగే చీఫ్ గెస్ట్ గా రాజమౌళి కూడా వచ్చారు. 

ఇక ఈ ఈవెంట్లో రాజమౌళి రామ్ చరణ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను హీరోలెవరిని కూడా పేరు పెట్టి పిలవను.. వారికి స్పెషల్గా ఓ పేరు పెట్టేస్తాను. అలా చరణ్ ని నేను హీరో అని పిలుస్తాను. మగధీర సినిమా నుండే నాకు రామ్ చరణ్ ని హీరో అని పిలవడం మొదలైంది.ఇక చరణ్ అని పిలవడం కంటే రామ్ అని పిలవడమే నాకు ఇష్టం. అలాగే నువ్వు ఏదైనా సినిమాలో హార్స్ మీద చేసే సీన్స్ ఉంటే నాకు ముందే చెప్పు.నా పర్మిషన్ తీసుకో .. ఎందుకంటే గుర్రం మీద చేసే సీన్స్ హక్కులు పూర్తిగా నావే.అవి చేయాలంటే నా పర్మిషన్ తీసుకోవాల్సిందే.

ఆ రైట్స్ నావే అన్నట్లు నాకు ముందుగా ఓ పేపర్ మీద రాసివ్వు అంటూ రామ్ చరణ్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రాజమౌళి నవ్వుతూ.. అయితే రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమాలో రాంచరణ్ హార్స్ రైడింగ్ చేస్తారు.. అందుకే రాజమౌళి అలా హార్స్ రైడింగ్ సన్నివేశాలు వేరే ఏదైనా సినిమాలో ఉంటే నా పర్మిషన్ తీసుకోవాలి అన్నట్లుగా సరదాగా చెప్పారు. ఇక రాంచరణ్ కి హార్స్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు.ఆయన హార్స్ రైడింగ్ ని చాలా ఇష్టపడతారు. అలాగే ఆయన దగ్గర గుర్రాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: