పసుపు తాడు గొప్పదనం చెప్పిన కీర్తి సురేష్.. ఈమె కామెంట్లకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!
మాది 15 సంవత్సరాల ప్రేమాయణం అని కీర్తి సురేష్ తెలిపారు. తాను ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలోనే ఆంటోనితో ప్రేమలో పడ్డానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. 15 సంవత్సరాల నుంచి తాము ప్రేమించుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. 2010లోనే మొదటిసారి ఆంటోని నాకు ప్రపోజ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. నెల రోజులు సరదాగా గడిపామని తర్వాత మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.
2016 సంవత్సరం నుంచి మా బంధం మరింత బలప్డిందని కీర్తి సురేష్ తెలిపారు. నాకు ప్రామిస్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని ఆమె పేర్కొన్నారు. మేము పెళ్లి చేసుకునే వరకు ఆ రింగ్ ను తీయలేదని సినిమాల్లో సైతం ఆ రింగ్ ను గమనించవచ్చని కీర్తి సురేష్ తెలిపారు. నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలా ఉందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఈ క్షణాలు నా హృదయం భావోద్వేగంతో నిండిన క్షణాలు అని ఆమె కామెంట్లు చేశారు.
మా వివాహం కోసం మేము ఎప్పటినుంచో కలలు కన్నామని కీర్తి సురేష్ వెల్లడించారు. ఆంటోని నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొంతమందికి నా సన్నిహితులకు మాత్రమే నేను లవ్ లో ఉన్నానని తెలుసని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. నా భర్తకు బిడియం ఎక్కువని పసుపు తాడు అనేది పవిత్రమైనదని శక్తివంతమైనదని మంచు ముహూర్తం చూసి మంగళసూత్రాన్ని బంగారు గొలుసులోకి మార్చుకుంటానని ఆమె అన్నారు.