వర్షం : బాలయ్య, చిరూ పోటీలో వున్నా అసలైన సంక్రాంతి హీరోగా నిలిచిన ప్రభాస్..!!

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న హీరో.. ప్రభాస్ ఈ రేంజ్ కి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు.. సినిమా సినిమాకి నటనలో వైవిధ్యం చూపుతూ వచ్చారు.. ప్రభాస్ తన మొదటి మూవీ ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు సపోర్ట్ తో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు..అయితే ప్రభాస్ నటించిన మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు…సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయింది..ప్రభాస్ హీరోగా,ఎస్ రాజు నిర్మాతగా, శోభన్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ సినిమా సెట్ అయింది..ఆ సినిమానే ‘’వర్షం “.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్  మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించింది..ప్రభాస్ హీరోగా ఒక లవ్ అండ్ యాక్షన్ మూవీ తీద్దాం అని మేకర్స్ ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు మ్యూజిక్ సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా వర్షం మూవీ పాటలే వినిపించేవి. దీనితో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

 2004 సంక్రాంతికి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్ర రిలీజ్ గురించి ప్రభాస్.. అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... వర్షం చిత్రాన్ని ఎం ఎస్ రాజుగారు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నారు. అప్పటికే మీరు నటించిన లక్ష్మి నరసింహ, చిరంజీవి గారి అంజి సినిమా రెండూ సిద్ధంగా ఉన్నాయి. దీనితో నేను ఎంఎస్ రాజుగారితో చిరు బాలయ్య మధ్యలో మన సినిమా వద్దులే సార్ తర్వాత చూసుకుందాం అని చెప్పాను.. లేదు రిలీజ్ చేయాల్సిందే అని ఆయన పట్టుబట్టారు... వెంటనే బాలయ్య మాట్లాడుతూ మీరు రాజులు కదా మాట వినరు అంటూ సరదాగా సెటైర్ కూడా వేశారు. వెంటనే ప్రభాస్ నవ్వుకున్నారు. అయితే వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లోనే అద్భుతమైన మూవీ.2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వర్షం మూవీ తో పాటు విడుదలైన బాలయ్య లక్ష్మి నరసింహ కూడా మంచి విజయం సాధించింది. కానీ చిరంజీవి అంజి మూవీ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: