చరణ్ మంచి మనస్సు.. గేమ్ ఛేంజర్ మూవీకి అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారా?
అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రామ్ చరణ్ మంచి మనస్సును చాటుకున్నారని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాకు చరణ్ కేవలం 65 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. ఒప్పందం ప్రకారం చరణ్ కు ఎక్కువ రెమ్యునరేషన్ అందాల్సి ఉన్నా ఈ హీరో మాత్రం లిమిటెడ్ గానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ ఛేంజర్ అవుతుందేమో చూడాల్సి ఉంది. హిట్ టాక్ ఈ సినిమాకు కీలకం కానుంది. గేమ్ ఛేంజర్ ఆంధ్ర హక్కులు ఏకంగా 65 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. చరణ్ తర్వాత సినిమాలకు సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసం దిల్ రాజు సైతం చాలా కష్టపడుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఆయన ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటి అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.