న్యూ ఇయర్ వేళ అభిమానులకి గుడ్ న్యూస్.. త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి మరో మెంబర్..!?

Thota Jaya Madhuri
2025 వచ్చేసింది. ఎంతో బాధతో కొంతమంది . మరి కొంతమంది చాలా చాలా సంతోషంగా ..2024 కి గుడ్ బై చెప్పేశారు . 2024 లో కొన్ని మంచి.. అదే విధంగా బ్యాడ్ కూడా జరిగాయి. అయితే చాలామంది జీవితాల్లో గుడ్ కన్నా బ్యాడే జరిగాయి . తమ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ 2024 కి బై బై చెప్పేసి 2025 కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. జనాలు ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా చాలా ఘనంగా జరుపుకున్నారు. స్టార్ సెలబ్రిటీలు న్యూ ఇయర్ పార్టీ ఎలా జరిగింది అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు . అయితే ఇదే మూమెంట్లో 2025 లో మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నాడు అన్న వార్త సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది.


ఎస్ 2025లో మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ యాడ్ అవ్వబోతున్నారట.  అయితే ఇక్కడే ఒక ట్వీస్ట్ ఉంది. అది మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోనా..? లేక నాగబాబు కుటుంబంలోనా..? అనేది క్వశ్చన్ మార్క్ గానే  మిగిలిపోయింది.  మెగా కాంపౌండ్ నుంచి లీక్ అవుతున్న సమాచారం ప్రకారం .."మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నారు.  అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది చెప్తుంటే.. లేదు లేదు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ మరి కొంతమంది మాట్లాడుకుంటున్నారు.


కాగా న్యూ ఇయర్ పార్టీలో ఈ విషయాన్ని మెగా దంపతులు బయటపెట్టారట . అయితే పని వాళ్ళ ద్వారా ఈ సమాచారం బయటకు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మెగా ఫ్యామిలీ లోకి న్యూ మెంబర్ రాబోతున్న విషయానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తాడో మెగాస్టార్ చిరంజీవి అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.  ఉపాసన ప్రెగ్నెంట్ అయితే మాత్రం మెగా ఫ్యామిలీకి కచ్చితంగా వారసుడే రావాలి అని కోరుకుంటారు అభిమానులు.  ఎందుకంటే ఆల్రెడీ వాళ్లకి ఒక పాప ఉంది . అయితే వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఆ ఆనందం వేరేగా ఉంటుంది . ఎందుకంటే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. ఇంతకీ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎవరు ఉపాసన నానా..? లావణ్య త్రిపాఠినా..? అనే క్వశ్చన్ మెగా అభిమానులకి బిగ్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: