సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇకపోతే కొంత మంది మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మరి కొంత మంది యాంకరింగ్ ఇతర టీవీ రంగాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది సక్సెస్ను సాధిస్తే మరి కొంత మంది మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. ఇకపోతే న్యూస్ రీడర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన ఓ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ను ముందుకు కొనసాగిస్తుంది.
ఆ బ్యూటీ ఎవరో అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు. ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నటి మణులతో ఒకరు అయినటువంటి ప్రియ భవాని శంకర్. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో న్యూస్ రీడర్ గా పని చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈమె కెరియర్ ప్రారంభంలో అనేక తమిళ సినిమాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు తెలుగు లో కూడా మంచి సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇప్పటివరకు ఈమె నటించిన తెలుగు సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్ ను అందుకోకపోయినా ఈ మధ్య చేసిన ప్రతి సినిమాలో కూడా ఈమె తను నటన తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు వరస పెట్టి తెలుగు లో అవకాశాలు వస్తున్నాయి. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమెకు ఏదైనా స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చి దానితో ఈమె మంచి విజయాన్ని అందుకున్నట్లయితే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి తెలుగు లో చేరిపోతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.