అకిరా వల్లే నాకు ఆ పని అలవాటయింది.. చరణ్..?

frame అకిరా వల్లే నాకు ఆ పని అలవాటయింది.. చరణ్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అనేక భాషల్లో విడుదల అయ్యి విడుదల అయిన ప్రతి చోట అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


దానితో ఈ సినిమా ద్వారా చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చరణ్ ఈ మూవీ ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా చరణ్ తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ టాక్ షో కు గెస్ట్ గా వెళ్లాడు. నిన్న చరణ్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ ఎపిసోడ్ లో భాగంగా చరణ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ కొడుకు అయినటువంటి అకిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది. ఆన్ స్టాపబుల్ టాక్ షో లో భాగంగా అకిరా గురించి చరణ్ మాట్లాడుతూ ... నాకు పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదు. చిన్నవాడైన అకీరా పుస్తకాలు బాగా చదువుతాడు. అలాగే నాకు చాలా సందర్భాల్లో అనేక పుస్తకాలను గిఫ్టుగా ఇచ్చాడు. దానితో నాకు కూడా పుస్తకాలు చదవడం అలవాటయింది అని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: