టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ 2024వ సంవత్సరం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈయన తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ ఈ సినిమాలో చరణ్ కు జోడిగా నటించగా ... అంజలి , సునీల్ , నవీన్ చంద్ర , శ్రీకాంత్ , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం చరణ్ "గేమ్ చేంజర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఆ మూవీ కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో కూడా ఈ సంవత్సరం చరణ్ ఓ మూవీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా చరణ్ ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు , ఓ సినిమాలో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ సంవత్సరం చరణ్ ఫుల్ జోష్లో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.