"చచ్చిన సరే 2025లో ఆ పని మాత్రం చేయను".. జాన్వి కపూర్ కి ఇన్నాళ్లకు బుద్దొచ్చిందా..?

Thota Jaya Madhuri
లైఫ్ లో ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేయకూడదు . ఇది అందరికీ తెలిసిన విషయమే . కానీ మనకు తెలిసి చేస్తామో..? తెలియక చేస్తామో..? తెలియదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో చాలామంది స్టార్స్ తప్పు చేసిన.. అది తప్పు అని తెలిసిన.. పదేపదే ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు . ఆ తర్వాత అయ్యయ్యో తెలియక తప్పు చేసేసామే అంటూ బాధపడిపోతూ ఉంటారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని హాట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ ..తెలుగులో 'దేవర' అనే సినిమాతో డెబ్యూ ఇచ్చింది.

 
అయితే ఈ సినిమా జాన్వికపూర్ కి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయింది . నెగిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది.  కానీ జాన్వీ కపూర్ కి తెలుగులో ఈ సినిమా కంటే ముందే బడా సినిమాలలో సైతం అవకాశాలు వచ్చాయట . కానీ పెద్ద హీరోతోనే తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అంటూ ఆగిపోయిందట . తండ్రి బోనికపూర్ సైతం అలాగే ఆమెకు నేర్పించారట . కానీ జాన్వి కపూర్ మిస్ చేసుకున్న మూడు సినిమాలు కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా హిట్ అయ్యాయి .


దీంతో ఇప్పుడు జాన్వీ కపూర్ 2025 లో మాత్రం అలాంటి తప్పు చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట.  సినిమా చిన్నదైనా పెద్దదైన ..కధా కంటెంట్ నచ్చితే తన పాత్రకు సరైన న్యాయం చేయగలను అని కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సినిమాను ఓకే చేసేస్తుందట .అది ఏ భాష అయినా ఎంత చిన్న హీరో అయినా అస్సలు వెనక్కి తగ్గనే తగ్గదట . 2025 మొత్తం కూడా తన ఓన్ తెలివితేటలతోనే నచ్చిన స్క్రిప్ట్ పరంగానే సినిమాలను ముందుకు తీసుకెళ్లాలి అంటూ డిసైడ్ అయిందట జాన్వికపూర్. ప్రజెంట్ జాన్వీ కపూర్ తెలుగులో రామ్ చరణ్ సరసన ఓ మూవీ చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: