బన్నీ త్రివిక్రమ్ సినిమా అలా ఉండబోతుంది..హైప్ పెంచేసిన ప్రొడ్యూసర్
అయితే దీనిపై నిర్మాత సూర్య దేవర నాగవంశీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియోనే నిర్మిస్తున్నట్లు తెలిపాడు. కథానుగుణంగా స్టూడియో నిర్మించే ప్లాన్‌లో ఉన్నామన్నాడు. 2025లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాలో వారిద్దరూ కూర్చుని ఫైనల్ చేయనున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ పార్ట్ చాలా ఉంటుందని అన్నాడు. స్టూడియో నిర్మిస్తున్న ఏరియాలో భారీ మొత్తంలో బడ్జెట్ ఖర్చుపెట్టబోతున్నట్టు తెలిపాడు.
ఈ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పాన్ ఇండియా డెబ్యూ ప్రాజెక్ట్ కాబోతుందని నాగ వంశీ హైప్ పెంచేశాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉందని తెలిపాడు. రాజమౌళి కూడా టచ్ చేయని జానర్‌లో ఈ సినిమా ఉంటుందని నాగవంశీ చెప్పుకొచ్చాడు. 2026వ సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుందని నిర్మాత స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రేక్షకులకు ఆయన మీద అంచనాలు పెరిగాయి.