ఒక్క సినిమా కూడా చేయకుండా.. 2024 మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఏకైక స్టార్ ఇతడే..!
ఈ హీరో ఒకటి కాదు రెండు కాదు 365 రోజులు కూడా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అయ్యాడు . ఆయన మరెవరో కాదు "మహేష్ బాబు". టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇయర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు . 2023లో షూటింగ్ చేసుకున్న సినిమా "గుంటూరు కారం".. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది . అంతే అది తప్పిస్తే 2024 లో ఎక్కడ తెరపై కనిపించలేదు మహేష్ బాబు .
అంతేనా ఆయనకు సంబంధించిన సినిమా అప్డేట్ ఏది కూడా అఫీషియల్ గా రాలేదు . కానీ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు అంటూ అంటే 2024 ఇయర్ మొత్తం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాడు మహేష్ బాబు. ఆ సినిమాలో ఆ హీరోయిన్ ..మహేష్ బాబు సినిమాలో ఈ హీరో విలన్ గా చేస్తున్నాడు.. మహేష్ బాబు ఈ సినిమా కోసం అలా చేస్తున్నాడు .. అంత బరువు తగ్గాడు .. రకాలుగా ఏదో ఒక వార్త కారణంగా సోషల్ మీడియాలో 365 రోజులు ట్రెండ్ అవుతూనే వచ్చాడు . అది సూపర్ స్టార్ రేంజ్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా పొగిడేస్తున్నారు. నిజానికి రాజమౌళి-మహేశ్ బాబు ల కాంబోలో సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సింది..కానీ కొన్ని కారణాల చేత లేట్ అవుతుంది. జనవరిలో మాత్రం ఖచితంగా సెట్స్ పైకి తీసుకొస్తాడట జక్కన్న..!