నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్న అట్లీ.. "బేబీ జాన్"కి ఎంత నష్టమో తెలుసా..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటివరకు రాజా రాణి , తేరి , బిగిల్ , మెర్సల్ , జవాన్ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలన్నీ కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు సూపర్ సాలిడ్ గుర్తింపు దర్శకుడిగా వచ్చింది. ఇకపోతే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి షారుక్ ఖాన్ హీరో గా నటించాడు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు కేవలం దర్శకుడిగా కెరియర్ను కొనసాగించిన అట్లీ "బేబీ జాన్" అనే సినిమాతో నిర్మాతగా కూడా కెరియర్ను ప్రారంభించాడు. తాను కొన్ని సంవత్సరాల క్రితం దర్శకత్వం వహించిన తేరి మూవీ ని బేబీ జాన్ అనే టైటిల్ తో హిందీ లో రీమేక్ చేశాడు. ఈ రీమేక్ మూవీ లో వరుణ్ ధావన్ హీరో గా నటించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి కేవలం 23.90 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

ఈ సినిమాను దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో అట్లీ రూపొందించినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంపేర్ అయ్యే వరకు కూడా ఆ స్థాయి కలెక్షన్లను రాబట్టడం కష్టం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దానితో ఈ సినిమా ద్వారా అట్లీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: