పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి మధ్య సఖ్యత లేదని గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట.అయితే అల్లు అర్జున్ జైల్లో పడ్డ సమయంలో మాత్రం పవన్ బన్నీని చూడడానికి ఢిల్లీ నుండి వచ్చారనే టాక్ మాత్రం వినిపించింది. కానీ బెయిల్ మీద బయటకు వచ్చాక పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే రీసెంట్గా కొంతమంది జర్నలిస్టులు ఓ సమావేశంలో పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడమని అడగగా.. అక్కడ మనుషుల ప్రాణాలు పోతున్నాయి.. అరెస్టు గురించి ఎందుకు అంటూ స్పందించారు. అయితే ఈ మాటలు విన్న చాలా మంది అల్లు అభిమానులు నిరాశ పడ్డారు. అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. నేను ఆయన ప్లేస్ లో ఉంటే గనక కచ్చితంగా అల్లు అర్జున్ జైల్లోనే ఉండేవారు అంటూ పవన్ మాట్లాడిన మాటలు అందరికీ షాకింగ్ కి గురిచేస్తున్నాయి.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టు గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. మొదట్లో నేను కూడా అలా థియేటర్ లకి వెళ్లి అక్కడ పరిస్థితి చూసాను. ఆ తర్వాత పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పుడు వెళ్లడం లేదు.బన్నీ కూడా వెళ్లకపోయి ఉంటే బాగుండేది. ఇక బన్ని వ్యవాహారంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త సాఫ్ట్ గా వ్యవహరిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక రేవంత్ రెడ్డి సినీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం బెనిఫిట్ షో లతోపాటు టికెట్ రేట్లు కూడా పెంచారు. ఇక టికెట్ రేట్లు పెంచడం వల్ల బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల భారీ అంచనాలతో వచ్చిన సినిమాలకు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. అలా సలార్,పుష్ప వంటి సినిమాలకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి.ఇక తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం బాధాకరం. కానీ ఆమె చనిపోయాక ఆమె కుటుంబానికి మేమున్నాం అంటూ సినిమా యూనిట్ మొత్తం ఆమె కుటుంబ సభ్యులకి మద్దతు ఇస్తే బాగుండేది. నిర్మాతలు గాని డైరెక్టర్ గాని హీరో గాని వెళ్లి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సింది. కానీ వాళ్ళు వెళ్లలేదు.
హీరోకి వెళ్లడానికి కుదరలేదు అలాంటప్పుడు నిర్మాత, దర్శకుడైన వెళ్లాలి కదా.. ప్రత్యక్షంగా ఎవరు కారణం కాకపోయినప్పటికీ ఇలాంటి సమయంలో హీరో ఒక్కడినే బాధ్యుడిని చేయడం ముమ్మాటికి తప్పే.సినిమా అంటే ఒక టీం లాంటిది.ఈ విషయంలో హీరో మీదే పూర్తి నేరం నెట్టేసి ఒంటరిని చేయడం తప్పు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాగానే వ్యవహరించారు. ఆయన కాదు ఆయన ప్లేస్ లో నేనున్నా కూడా అల్లు అర్జున్ ని జైల్లోనే వేస్తాను.ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. అందులో రేవంత్ రెడ్డి చేసిన తప్పేమీ లేదు.చాలామంది సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు తీయలేదని అందుకే బన్నీని అరెస్టు చేయించారని అంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న వాటిని రేవంత్ రెడ్డి పట్టించుకోరు.ఆయన ఎలాంటి లీడరరో నాకు తెలుసు.. అంటూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తూ అల్లు అర్జున్ కి కూడా మద్దతు ఇస్తూనే చట్ట పని తాను చేస్తుంది అన్నట్లుగా మాట్లాడారు