చిరంజీవికే గజగజ వణుకు పుట్టించిన ఏకైక హారర్ మూవీ ఇదే..!
కానీ కొంతమంది స్టార్స్ కొన్ని కొన్ని సినిమాలు చూసి నిజంగానే భయపడిపోతూ ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తాడు మన మెగాస్టార్ చిరంజీవి . టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే పెర్ఫార్మన్స్ ఇచ్చే మెగాస్టార్ చిరంజీవిని గజగజ వణికిచ్చింది ఒక సినిమా . అది కూడా హారర్ సినిమా. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి స్వయానా ఈ విషయాన్ని బయట పెట్టడం గమనార్హం.
చిరంజీవి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." నేను హారర్ సినిమాలు చాలా తక్కువగా చూస్తాను . కానీ చూసినవి మాత్రం ఇంట్రెస్ట్ గా అబ్సర్వ్ చేస్తూ ఉంటాను. అయితే కాంచన సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నా చెయ్యి వణుకు వచ్చేసింది. అసలు ఏంట్రా బాబు ఇలాంటి సినిమా తెరకెక్కించాడు లారెన్స్ అనుకున్నాను. అంత భయంకరంగా సినిమా ఎలా తరికెక్కిస్తారు..? అని ఆలోచించాను. మరీ ముఖ్యంగా ఆ ఇంట్లో దయ్యం ఉందా..? లేదా..? అనే మూడు టెస్టులు ఆధారంగా కన్ఫామ్ చేసే సీన్స్ గజగజ వణుకు పుట్టించింది. ఇంట్లోకి ఆవు రావడం ..ఆ తర్వాత దీపం వెలిగించడం.. ఆ తర్వాత దెయ్యం వచ్చి అలా రక్తాన్ని పీల్చుకోవడం ..వామ్మో గజగజ అనిపించేసింది .అలాంటి సినిమాలు లారెన్స్ మాత్రమే తెరకెక్కిస్తాడు " అంటూ ఓ రేంజ్ లో లారెన్స్ ని పొగిడేస్తూ ..ఆ సినిమా చూసి భయపడ్డాను అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసాడు మెగాస్టార్ చిరంజీవి . దీంతో ఈ న్యూస్ మరొకసారి నెట్టింట బాగా వైరల్ గా మారింది..!