2025ఓజి ఇయర్ కాబోతోందా.. పవన్ ఫ్యాన్స్ కాలర్ పైకెత్తాల్సిందేనా.?

Pandrala Sravanthi
- డిప్యూటీ సీఎంకు ఓజి సెగ  
- ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎదురుచూపులు
- 2025లో అయినా కల నెరవేరేనా.?

 పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి ఈయన  ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఆయన సినిమాల్లో స్టార్డం  తెచ్చుకున్నది ఒకెత్తు అయితే, రాజకీయాల్లో నిలబడ్డది మరో ఎత్తు..  జనసేన పార్టీ పరిస్థితి ముగిసింది పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అనే సమయానికి, పడి లేచిన కెరటంలా  అద్భుత కసరత్తు చేసి తాను నిలబడడమే కాకుండా, పార్టీని నిలబెట్టి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు.  అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా పెద్ద హోదాలో ఉన్న కానీ ఆయన ఫ్యాన్స్ ఇంకా సినిమాల గురించి ఆలోచన చేస్తున్నారు. ఆయన నుంచి అభివృద్ధి పనులు కోరుకోకుండా ఓజి సినిమా ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. సభలు సమావేశాలు ఎక్కడ పెట్టినా,  వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోకుండా ఓజి సినిమా ఎప్పుడు వస్తుంది అన్నా అంటూ  మాట్లాడుతున్నారట.. మరి ఓజి సినిమా  గత కొన్ని సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తోంది. 2024 లో తప్పక వస్తుందని అందరూ భావించారు. అటు ఇటు చూడగానే 2024 గడిచిపోయింది. ఇంకా కొన్ని గంటల్లో 2025 కూడా రాబోతోంది.  మరి వచ్చే కొత్త ఏడాదిలో అయినా ఓజి సినిమా వస్తుందా.. లేదంటే అభిమానులకు కలగానే మిగిలిపోతుందా. అనే వివరాలు చూద్దాం..

 పవన్ ఫ్యాన్స్ కల నెరవేరేనా?


పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని ఎంతో కష్టపడి పాలన చేస్తున్నాడు.. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ రాష్ట్ర అభివృద్ధికై ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన ఓజీ సినిమా కూడా పూర్తి చేసి మీ ముందుకు వస్తానని కూడా వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ లేని సీన్స్ అన్ని పూర్తి చేసినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం వారు పవన్ టైం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఎదురుచూపులకు దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తయింది. ఇదే తరుణంలో చాలామంది అభిమానులు ఎక్కడ సభ పెట్టిన ఓజీ సినిమా ఎప్పుడు వస్తుందని పవన్ ను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఏపీలో రెండు మూడు ప్రాంతాల్లో సభలు పెట్టినప్పుడు ప్రజలు అభివృద్ధి గురించి అడగకుండా ఓజి సినిమా గురించి అడగడంతో పవన్ కాస్త సీరియస్ అయ్యారు.

 దీంతో చిత్ర యూనిట్  రియాక్ట్ అయి  ఈ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు.. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. కానీ రాజకీయ సభలకు వెళ్ళినప్పుడు మీరు ఈ సినిమా గురించి అడగడం, ఆయనను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని డీవీవీ చిత్ర యూనిట్ వారు  సోషల్ మీడియా వేదికగా  తెలిపారు. వీలైనంత త్వరగా 2025లో ఈ సినిమాను మేము మీ ముందుకు తీసుకువస్తాం. వచ్చే కొత్త ఏడాది ఓజీ పండగ  చేసుకుందాం.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో పవన్ అభిమానులు మొత్తం ఆ కామెంట్ కు మద్దతుగా నిలుస్తూ  పవర్ స్టార్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు..  ఏది ఏమైనా 2025 పవన్ ఓజి ఏడాదిగా నిలుస్తుందా లేదంటే ఈ ఏడాది కూడా అభిమానులు  కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేలా చేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: