నటననే కాదు చదువులో కూడా మెగాస్టార్ గ్రేట్.. చిరు క్వాలిఫికేషన్స్‌ ఇవే..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్త గా పరిచయం అక్క లేదు స్వయం కృషి తో చిత్ర పరిశ్రమ లో ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం .. నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి వారి తర్వాత అంతటి స్థాయిలో భారీ అభిమానులను సంపాదించుకుంది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే .. నటన డ్యాన్స్ , డైలాగ్స్ , ఫైట్స్ ఇలా చిరంజీవి ఏం చేసినా ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది . సినిమాల్లో మెగాస్టార్ గా గొప్ప పేరు తెచ్చుకున్న చిరంజీవి ఏం చదువుకున్నారు అంటే ? అయితే ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం .

ఇక చిరంజీవి విద్యాభ్యాసం మొదట నిదడవోలులో మొదలైంది .. ఆ తర్వాత గురజాల , పొన్నూరు , మంగళగిరి , మొగల్తూరు వరకు సాగింది .. ఇక ఒంగోలులోని పి ఆర్ శర్మ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపిసి చదివారు చిరంజీవి .. ఆ తర్వాత నర్సాపూర్ కళాశాలలో బీకాం పూర్తి చేశారు . ఇక డిగ్రీ తర్వాత 1976 లో చెన్నై కు వెళ్లారు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో డిప్లమో పొందారు .. ఆ తర్వాత నటునిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత జయకృష్ణ చిరంజీవి కి తొలిసారిగా పునాదిరాళ్లు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు .. అలా చిరంజీవి నటుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వం లో విశ్వంభ‌ర సినిమా లో నటిస్తున్నాడు .. ఈ సినిమాను 2025 సామర్ల ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో కూడా ఓ సినిమా కు ఓకే చెప్పారు మెగాస్టార్ .. వీరి తో పాటు స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్‌ నడుస్తుంది . ఇలా మెగాస్టార్ చిరంజీవి 6 పదుల వయసు లో కూడా వరుస సినిమాలతో  యంగ్ హీరోల కు పోటీ ఇస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: