మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ప్రజారాజ్యం అనే పొలిటికల్ పార్టీని స్థాపించి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ చిరంజీవి పొలిటికల్ లో భారీ స్థాయిలో సక్సెస్ కాలేదు. దానితో చిరంజీవి రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి వయస్సు 69 అయినా కూడా ఆయన వరుస పెట్టి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.
ఆయన పక్కన హీరోయిన్లు ఉండడం , ఆయన వారితో స్టెప్పులు వేస్తూ ఉండడంతో చిరంజీవి అలాంటి పాత్రలు కాకుండా హీరోయిన్ లేకుండా పాటలు లేకుండా సినిమాలు చేస్తే బాగుంటుంది అనే సలహాలను ఇచ్చిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇకపోతే ఆయన మాత్రం తన పందలో తాను దూసుకుపోతున్నాడు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోయే సినిమాలో హీరోయిన్ ఉండదు అని , అలాగే ఆ సినిమాలో ఎలాంటి పాటలు ఉండవు అని తెలుస్తుంది.
దీనితో చిరంజీవి నుండి కొత్త దనం ఆశించే వారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటూ ఉంటే , చిరంజీవి డ్యాన్స్ ను ఇష్టపడేవారు అంత పెద్ద ప్రయోగం ఎందుకు చిరంజీవి డాన్సులు వేస్తేనే సినిమా అద్భుతంగా ఉంటుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే హీరోయిన్ ఉంటుందా ..? పాటలు ఉంటాయా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.