మనుషులు చనిపోతే ఏం మాట్లాడతాం...? అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు!

MADDIBOINA AJAY KUMAR
గత కొద్ది రోజులుగా సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎక్క‌డ‌కు వెళ్లినా ఈ ఘటన పైనే చర్చ జరుగుతోంది. పుష్ప- 2 బెనిఫిట్ షో సందర్భంగా అక్కడకు అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వెళ్లగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిస‌లాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనపై అటు ప్రభుత్వం ఇటు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం బన్నీ బెయిల్ తీసుకుని బయట ఉండగా రేవతి కుటుంబానికి న్యాయం చేస్తానని ప్రకటించారు. 

రేవతి కుమారుడిని ఆసుపత్రిలో చూపించడంతోపాటు ఆ కుటుంబానికి పుష్ప టీమ్, అల్లు అర్జున్ కలిసి రెండు కోట్ల ఆర్థిక సాయం సైతం ప్రకటించారు.  అయినప్పటికీ ఈ ఇష్యూకు తెర‌ప‌డ‌టం లేదు. ఏదో ఒక విధంగా ప్రతిరోజు దీనికి సంబంధించిన వార్త వినిపిస్తూనే ఉంది. ఇక మెగా  ఫ్యామిలీ ఎక్కడ కనిపించినా మీడియా సంధ్య థియేటర్ ఘటనపై స్పందించాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో నేడు ఓ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా సంధ్య థియేటర్ ఘటనపై స్పందించాలని కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడుతాం అని అన్నారు.

ఇది సంబంధం లేని ప్రశ్న అని సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టాలని మీడియాకు సూచించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు కుట్రపూరితంగా జరిగిందని ఓవైపు ఆరోపణలు వస్తున్నాయి. తన పేరు మర్చిపోయారని సీఎం కుట్ర పన్నాడ‌ని తెలంగాణలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే మెగా ఫ్యామిలీ కుట్ర చేసి అరెస్ట్ చేపించింది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి ఆయనను కలిసి ఆ వార్తలకు చెక్ పెట్టారు. నాగబాబుతో కూడా బ‌న్నీ భేటీ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అల్లు అర్జున్ ను కలవలేదు. ఇప్పుడు ఆ ఘటనపై కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: