జైలు జీవితాన్ని గడిపిన సుమన్ కు..పిలిచి పిల్లనిచ్చిన టాలీవుడ్ దిగ్గజం..!
టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన సుమన్ తన అందం నటనతో డాన్స్ తో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. చాలామందికి సుమన్ అసలు పేరు మాత్రం ఎవరికి తెలియదు.. ఈయన అసలు పేరు సుమన్ తల్వార్.. ఈయన మాతృభాష తెలుగు కాకపోయినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈయన బాగా దగ్గరయ్యారు. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడిన సమయాలలో హీరో భానుచందర్ తో స్నేహం ఏర్పడడం వల్ల వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఎదిగారు.
అంతేకాకుండా వీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్ పైన కూడా మంచి పట్టు సాధించారు. అలా మొదటి చిత్రంలో నటించే అవకాశం భానుచందర్ కి రావడంతో ఆ తర్వాత సుమన్ ని కూడా తన రికమండేషన్ ద్వారా ఎన్నో చిత్రాలను నటింపజేసేలా చేశారట. ఫలితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికీ తెలిసేలా చేశారు వీరు. ఎన్నో చిత్రాలలో నటించి టాప్ రేంజ్ లోకి వెళ్ళిన సుమన్ చిరంజీవికి పోటీగా తన సినిమాలను విడుదల చేస్తాయికి ఎదిగారు. అయితే సుమన్ కెరియర్ లో ఒక మచ్చగా మిగిలిపోయినది నీలి చిత్రాల కేసు.. ఒకానొక సమయంలో ఈ విషయం పైన బెయిల్ కూడా దొరకని రోజులు ఉన్నాయట. జైలు జీవితాన్ని కూడా గడిపిన సుమన్ ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సుమన్ కూడా ఈ విషయంపై కృంగిపోవడమే కాకుండా జైలు నుంచి బయటికి వచ్చాక సినిమా చాన్సులు రాక చాలా ఇబ్బందులు పడ్డారట. అయితే ఆ తర్వాత శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తన కెరియర్ నలుపు తిరిగింది. ప్రముఖ రచయితగా పేరుపొందిన డివి నరసరాజు తన మనవరాలితో హీరో సుమన్ పెళ్లి చేయించారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. దీంతో సుమన్ మీద పడ్డ మచ్చ నెమ్మదిగా తగ్గిపోయిందట. ఆ తర్వాతే సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారట.