చాలామంది హీరో హీరోయిన్లు పెళ్లి అనే విషయాన్ని సీక్రెట్ గా ఉంటారు. అయితే పెళ్లి చేసుకునే వరకు కూడా వీరి ఫోటోలు బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా జాగ్రత్తలు తీసుకున్న హీరోయిన్ లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. కీర్తి సురేష్ ఈనెల అనగా డిసెంబర్ 11న తన 15 సంవత్సరాల ప్రేమకి పెళ్లి బంధంతో ముగింపు పలికింది.. అలా ఆంటోనీ తట్టిల్ కీర్తి సురేష్ లు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నాక ఆమెపై ట్రోల్స్ ఎక్కువైపోయాయి.అయితే పెళ్లి మరి కొద్ది రోజులు ఉంది అనగా కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ మూవీ నుండి ఆమె హాట్ గా నటించిన ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్లో కీర్తి సురేష్ బోల్డ్ నెస్ చూసి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి పెళ్లికి ముందు ఇలాంటి పిచ్చి వేషాలు ఏంటో అని అందరూ అనుకున్నారు.ఇక అదంతా కామన్.
ఆ విషయం పక్కన పెడితే..డిసెంబర్ 11 న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా రెండోసారి పెళ్లాడింది.అలా వీరి పెళ్లి వేడుకలు ముగిసిన వెంటనే కీర్తి సురేష్ తన బాలీవుడ్ మూవీ అయినటువంటి బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా కీర్తి సురేష్ మొదటి హిందీ సినిమానే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈమె ని బ్యాడ్ లక్ వెంటాడుతుందని, పెళ్లయ్యాక కీర్తి సురేష్ కి అంతగా కలిసి రాలేదని, ఆమెకు పెళ్లి జీవితం అచ్చి రాలేదు అంటూ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు కీర్తి సురేష్ జాతకంలో ఉన్న దోషం కారణంగానే ఆమెకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి.
దోష నివారణ పూజలు చేయించుకోపోతే ఈ ఫలితాలు మరింతగా పెరిగిపోయి ఆమె సినీ కెరియర్ పై ప్రభావం చూపిస్తాయి అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే ఒక సినిమా ఫ్లాఫ్ అయితే ఆ ప్రభావం మొత్తం కెరియర్ పై ఉంటుందని అనుకోవడం తప్పు.. అలాగే కీర్తి సురేష్ వరుణ్ ధావన్ కాంబోలో వచ్చిన బేబీ జాన్ మూవీ సరిగ్గా ఆడియన్స్ ని చేరకపోవడానికి కారణం హిందీలో ఇప్పటికీ కూడా పుష్ప టు మూవీ హవా కొనసాగుతోంది.ఈ సినిమా హవా తగ్గాక థియేటర్లోకి వస్తే బేబీ జాన్ మూవీని అందరూ గుర్తించేవారు కావచ్చు.కానీ పుష్ప-2 సినిమా ఇంకా థియేటర్లో ఆడుతుంది కాబట్టి పుష్ప టు ముందు బేబీ జాన్ ని అంతగా పట్టించుకోవడం లేదు.