హెరాల్డ్ ప్లాష్‌బ్యాక్ 2024 : ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోల సైతం కంబ్యాక్ అనేలా చేసుకున్న మెలోడీ బ్రహ్మ.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి పేరు చెబితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో బీజీఎమ్ బద్దలవుతుందో,ఎవరి పేరు నటరాజును నాట్యమాడించగలదో,ఎవరి పేరు  సంగీత కిరీటానికి సరితూగగలదో ఆయనే మణిశర్మ. పదేళ్ల క్రితం ఇది పేరు కాదు. ఇదొక బ్రాండ్. స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టి వారి సినిమా పోస్టర్‌లో పేరు కోసం ప్రాకులాడారంటే ఆ పేరుకి, ఆయన ఇచ్చే సంగీతానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పూర్తి పేరు నమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీ మణిహారంగా నిలిచేందుకు ఆయన మార్చుకున్న పేరు ‘మణిశర్మ’. ఇదిలావుండగా ప‌దేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాల‌కు సంగీతం అందించారు ఇప్పటి వరకు 200  సినిమాలకు సంగీతం అందించారు.ఇదిలావుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ తన మ్యూజిక్ డైరెక్షన్ జర్నీ గురించి పంచుకున్నారు.మ్యూజిక్ డైరెక్టర్‌గా తొలి అవకాశం తెలుగు సినిమాల్లోనే వచ్చింది. ఇప్పటి వరకు 200 వరకు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు చెప్పారు. ఇక తమిళంలో 25 చిత్రాలు. కన్నడలో కొన్ని సినిమాలకు సంగీతం అందించినట్టు చెప్పుకొచ్చారు. తెలుగులో మొదట సంతకం చేసిన సినిమా చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ, 

అశ్వనీదత్ కాంబినేషన్‌‌లో వచ్చిన సినిమా. రెండు పాటలు కంపోజ్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.రెండేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి గుణశేఖర్ వచ్చారు. అదే చూడాలని ఉంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ ఏవీఎస్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ డి.రామానాయుడు నిర్మించిన ‘సూపర్ హీరోస్’. ఇక ఆర్జీవి దర్శకత్వంలో తెరకెక్కరిన ‘రాత్రి’ ‘అంతం’ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.మణి శర్మ.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, అనుమాలిక్ తెలుగులో కోటి దగ్గర పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో కీ బోర్డ్ ప్లేయర్‌గా మన దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సంగీత దర్శకుడు తానే అన్నారు. అపుడు అందరు రూ. 10 వేలు తీసుకునే సమయంలో తాను రూ. లక్ష వరకు తీసుకున్నారు.  ఆ తర్వాత ఏ.ఆర్.రహమాన్ కూడా ఎక్కువ పారితోషకం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.ఈ మ‌ధ్య దేవీ, థ‌మ‌న్‌కు తోడు కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి తాల‌లేక కాస్త జోరు త‌గ్గించాడు మ‌ణిశ‌ర్మ‌. ఒక‌ప్ప‌ట్లా స్టార్ హీరోల సినిమాలు కాక‌పోయినా.. చిన్న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. కానీ తనకు వచ్చిన అవకాశాలు యూజ్ చేసుకుని ఇప్పుడు మళ్లీ స్టార్ హీరోల వైపు అడుగులు వేస్తున్నాడు మణిశర్మ.

ఇక తాను విధిని నమ్ముతాను. తనతో పాటు అందరికి అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తినన్నారు. 2017లో అమీతుమీ, ఫ్యాష‌న్ డిజైన‌ర్, శ‌మంత‌క‌మ‌ణి, లై.. 2018లో దేవదాస్ లాంటి సినిమాల‌కు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. ఆ తర్వాత 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. ఈ సినిమాకు త‌న ప్రాణం పెట్టేసాడు మ‌ణిశ‌ర్మ‌. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణి కోసం మళ్లీ స్టార్ హీరోలు వస్తున్నారు. ముఖ్యంగా దేవీ జోరు తగ్గించడం.. తమన్ రొటీన్ అయిపోవడంతో మళ్లీ మణిశర్మ గుర్తుకొస్తున్నాడు. సీనియర్ హీరోలు కూడా కొందరు మణిశర్మతో తమ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. వెంకటేష్‌తో నారప్ప, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశారు. ముఖ్యంగా తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్‌లో తన సినిమాలతో రఫ్పాడించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు,ఇంద్ర, టెంపర్ వంటి సినిమాల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: