జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఈయన నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో వరుసగా ఈయనకు అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీలా హీరోయిన్గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో హైపర్ ఆది కూడా నటించాడు. ఈ సినిమాలో రాము రమేష్ , హైపర్ ఆది మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఈ సినిమా విజయంలో వీరిద్దరి కామెడీ ట్రాక్స్ కూడా కీలక పాత్రను పోషించాయి. ఇకపోతే తాజాగా హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయనకు మిమ్మల్ని ధమాకా సినిమాలో ఒక్క రోజు పాత్ర కోసం పిలిచి ఆ తర్వాత మీతో చాలా రోజులు షూటింగ్ చేశారంట నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి ఆది సమాధానం ఇస్తూ ... నన్ను ధమాకా సినిమాలో కేవలం ఒక సన్నివేశం కోసం పిలిచారు. నేను కూడా వెళ్లి చేశాను.
ఆ సన్నివేశం నాకు రావు రమేష్ గారి మధ్య ఉంటుంది. ఆ సన్నివేశం తీసేటప్పుడు , తీసిన తర్వాత అందరూ చాలా నవ్వారు. దానితో వీరిద్దరి ట్రాక్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని దర్శకుడు , హీరో అందరూ నమ్మారు. దానితో నా క్యారెక్టర్ ను చాలా పొడిగించారు. ఒక్క రోజు పాత్ర కోసం పిలిచి నాతో చాలా రోజులు ఆ సినిమాలో పాత్ర చేయించారు అని హైపర్ ఆది తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.