అల్లు అర్జున్ వెనక ఇప్పుడు నిలబడేది ఎవరు..?

shami
పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడగా.. అల్లు అర్జున్ అదే రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి అదంతా యాక్సిడెంటల్లీ జరిగింది. ఇందులో ఎవరి తప్పులేదన్నట్టు మాట్లాడాడు. పుష్ప 2 ఓ పక్క 1500 కోట్ల వసూళ్లతో కెరీర్ బెస్ట్ మాత్రమే కాదు ఎన్నో రికార్డుల్లో ఫస్ట్ గా ఉంటూ వస్తుంటే అల్లు అర్జున్ మాత్రం ఈ ఇష్యూలో పడి నలిగిపోతున్నాడు.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత సీపీ ఆనంద్ ఇచ్చిన వివరణ తెలిసిందే. ఐతే అల్లు అర్జున్ మాటలు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదంతా మళ్లీ అతనికి జైలు బాట పట్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఐతే ఈ టఫ్ టైం లో అల్లు అర్జున్ వెంట ఉండే హీరో ఎవరు.. బన్నీ జైలులో అర పూట అదే ఒక రాత్రి ఉండి వస్తేనే ఇండస్ట్రీలో అగ్ర హీరోలు తప్ప అందరు ఇంటికి వచ్చి తమ సపోర్ట్ అందించారు.
మరి ఇప్పుడు ఈ టఫ్ టైం లో అల్లు అర్జున్ కి ఎవరు సపోర్ట్ గా నిలుస్తారు. ఇలాంటి టైం లో అతనికి తోడుగా ఎవరు ఉంటారు. అఫ్కోర్స్ అతని టీం అంతా బన్నీకి అండగా ఉంది. కానీ థియేటర్ ఘటనలో అసలు ఏం జరిగింది అన్నది ఇప్పటికీ అల్లు అర్జున్ అర్ధం చేసుకున్నట్టుగా లేదు. బయట పరిస్థితులు ఈ విషయంలో రోజు రోజుకి పెద్దదవుతున్న టైం లో అల్లు అర్జున్ కూడా నిజానిజాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలా సినిమా ఈవెంట్స్ లో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదు.

సో ఈ టఫ్ టైం లో అల్లు అర్జున్ కి తన ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ అవసరమే. ఐతే ఫ్యాన్స్ ని కూడా బన్నీ మీరు కూడా వ్యతిరేకత చూపేలా ఏమి చేయొద్దని ముందే చెప్పాడు. సో మొత్తానికి అల్లు అర్జున్ ని ఈ ఘటన చాలా పెద్ద సమస్యల్లో నెట్టేసిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: