1000 కోట్లు ఇచ్చినా అందులో నటించను.. ప్రభాస్ ని అవమానించిన హీరోయిన్..?

Pandrala Sravanthi
ప్రభాస్ తో సినిమా అంటే ఎవరైనా సరే సంతోషపడతారు.కానీ ఈ హీరోయిన్ మాత్రం నాకు 1000 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నేను ఆయన మూవీలో నటించినని తెగేసి చెప్పిందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు ప్రభాస్ సినిమాలో నటించను అని అలాంటి పాన్ ఇండియా స్టార్ ని అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ సినిమాలో అవకాశం కోసం ఎంతో మంది హీరోయిన్లు ట్రై చేస్తూ ఉంటారు.ఇక ఈ మధ్యకాలంలో కొత్త కొత్త హీరోయిన్లకు ప్రభాస్ అవకాశం ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఆయన సినిమా ద్వారా ఇమాన్వి ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అయితే చాలామంది దర్శకులు ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ ని మాత్రమే ఎక్కువ చేసి చూపిస్తారు. ఇక ఆయన పక్కన ఏ హీరోయిన్ ఉన్నా చూస్తారు అనే భావన వారిలో ఉంటుంది. అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.

ఆయన ఓవైపు కల్కి టు, సలార్ టు, ది రాజా సాబ్,ఫౌజీ,స్పిరిట్ అంటూ వరుస సినిమాల్లో చేస్తున్నారు. ఓ సినిమాలో గ్యాప్ వచ్చేసరికి మరో సినిమా షూట్ లో వాలిపోతున్నారు. అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తో చేసే సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందని రీసెంట్గా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరైతే బాగుంటుంది అని అనుకునే సందర్భంలో మృణాల్ ఠాకూర్  డైరెక్టర్ మైండ్ లోకి వచ్చిందట.అయితే కొంతమందిని మృణాల్ దగ్గరికి పంపించి స్పిరిట్ మూవీలో హీరోయిన్గా చేయమని అడిగితే నో నో 1000 కోట్లు ఇచ్చినా సరే నేను ఆయన సినిమాలో నటించను. సందీప్ రెడ్డి వంగా సినిమాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆయన తన సినిమాల్లో చాలా బోల్డ్ సన్నివేశాలతో పాటు వైల్డ్ గా చూపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లని ఏ విధంగా గ్లామర్ గా చూపిస్తారో చెప్పనక్కర్లేదు.

 అలాంటి ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలో నేను చేయలేను.ఆయన చెప్పే రొమాంటిక్ సన్నివేశాలు,బోల్డ్ సీన్స్ లో చేయడం నావల్ల కాదు అంటూ తెగేసి చెప్పిందట. అయితే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబోలో వచ్చే సినిమాకి హీరోయిన్ ఆఫర్ వస్తే మృణాల్ ఠాకూర్ రిజెక్ట్ చేసింది అనే న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారడంతో చాలామంది ఈ రూమర్ విన్న నెటిజన్స్ సమంత,తమన్నా, రష్మిక వంటి హీరోయిన్సే మొదట అలాంటి సినిమాలు చేయమని చెప్పి ప్రస్తుతం అవకాశాలు లేక వాటికి కూడా ఓకే చెబుతున్నారు. అలాంటిది నువ్వెంతా అంటూ ఏకిపారేస్తున్నారు.అంతేకాదు ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసి ఆయన్ని అవమానించినట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు. నీకు 1000 కోట్లు ఎందుకు  10 కోట్లు ఇస్తానంటే నీకంటే బెటర్ హీరోయిన్ వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి మృణాల్ ఠాకూర్ నిజంగానే ప్రభాస్ సినిమాని రిజెక్ట్ చేసిందా అనేదాంట్లో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: