అర్జున్ రెడ్డి తర్వాత టాలీవుడ్ కొత్త ట్రెండ్ .. గడ్డం పెంచితే సినిమా హిట్..!
ఇక తర్వాత మూడు తరం హీరోలుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున కూడా చాలా వరకు తమ సినిమాల్లో అదే పద్ధతిని కొనసాగించారు . సినిమాలో తమ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప ఎప్పుడు క్లీన్ అండ్ నీట్ గా కనిపించేందుకు ట్రై చేసేవారు . ఇప్పుడు ఆ ట్రెండు మొత్తం మారిపోయింది .. హీరోలంతా పోటా పోటీగా గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు .. రంగస్థలంలో రామ్ చరణ్ , పుష్పలో అల్లు అర్జున్, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోలు అంత గడ్డం లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు.. ఇక నాన్నకు ప్రేమతో సినిమాతో బియార్డ్ లుక్ లోకి మరిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత త్రిబుల్ ఆర్, దేవరలోను అదే లుక్ ని కంటిన్యూ చేశాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టి ప్రస్తుతం దూసుకుబోతున్న తేజా సజ్జ కూడా ఈ గడ్డం గ్యాంగ్ లో చేరిపోయాడు .. మన హీరోలే కాదు గట్టిగా మాట్లాడితే కన్నడ లో గడ్డం గ్యాంగ్ తెగ పెరిగిపోతుంది ..
కే జి ఎఫ్ లో యాష్ కాంతారాల రిషబ్ శెట్టి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు .. సినిమాల్లో గడ్డాన్ని సెంటిమెంట్గా పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా మరి అత్యవసరమైతే చిన్న గడ్డంలో కనిపించే మహేష్ బాబు కూడా పూర్తిగా గడ్డం బ్యాచ్ లోకి అడుగుపెట్టేసాడు.. టక్కరి దొంగ , మహర్షి సినిమాల్లో ట్రిమ్మింగ్ గడ్డంతో కనిపించాడు.. ఇప్పుడు రాజమౌళితో చేసే సినిమాలో పూర్తిగా తన లుక్కునే మార్చేశాడు .. పొడవాటి జుట్టూ గుబురిగట్టంతో ఎప్పటికప్పుడు కనిపిస్తూ అభిమానులను ఆలరిస్తున్నాడు. గడ్డం బ్యాచ్ అనగానే యంగ్ హీరోలు శర్వానంద్, సాయి దుర్గ తేజ్, నాని రానా ముందు గుర్తొస్తారు. మెగా మెనఅల్లుడు సాయి దుర్గతేజ్ చిత్రలహరి సినిమాలో గుబురు గడ్డంతో చాలా నేచురల్ గా నటించాడు . ఇలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు గడ్డం గ్యాంగ్ లో చేరిపోయారు .. గడ్డం ఉంటే సినిమా హిట్ అనే విధంగా .. హీరోలు గడ్డాన్ని పెంచేస్తున్నారు.. టాలీవుడ్ లో ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఇదే కొత్త ట్రెండ్గా మారింది.