గేమ్‌ ఛేంజర్‌: మేకప్‌కే 4 గంటలు పట్టేది ?

Veldandi Saikiran
రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట రామ్ చరణ్ ను పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అనంతరం తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

గేమ్ చేంజెర్ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్రను పోషించారు. తాజాగా శ్రీకాంత్ ఓ సమావేశంలో పాల్గొన్నారు.

అందులో ఆయన మాట్లాడుతూ.....డైరెక్టర్ శంకర్ తో పని చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. గేమ్ చేంజర్ సినిమాతో నాకు అదృష్టం దక్కింది. ఇందులో నేను సీఎం పాత్రను పోషించాను. లుక్ పరంగా ప్రోస్థటిక్ మేకప్ తో కనిపిస్తాను. నేను ఇప్పటివరకు ఇలాంటి మేకప్ వేసుకొని నటించలేదు. ఈ మేకప్ వేసుకోవడానికి నాకు నాలుగు గంటల సమయం పట్టిందని శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సినిమాలో తన పాత్ర డిఫరెంట్ షేడ్స్ తో ఉంటుందని ఎన్నో సస్పెన్స్ లతో థ్రిల్ ని పంచుతుందని శ్రీకాంత్ వెల్లడించాడు.

గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించానని శ్రీకాంత్ వెల్లడించాడు. శంకర్ గారి ప్రతి సినిమాలో ఉండేలా ఇందులోను సామాజిక సందేశం ఉంటుంది. కార్తీక్ సుబ్బరాజు మంచి కథను అందించారు. ఆ కథ శంకర్ గారికి బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను చేయడానికి వెంటనే ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఈ సినిమాకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవని శ్రీకాంత్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: