నేటితో బిగ్ బాస్ సీజన్ 8 ముగియనుంది. సెప్టెంబర్ 1వ తేదీన మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు కనుల పండుగగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఈ 8వ సీజన్ లో మరోసారి ప్రజల మనసునను దోచుకుంది.
అయితే ఈ సీజన్ లో వైల్డ్ కార్డులతో కలిపి మొత్తం 22 మంది బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అయ్యారు. అందులో ఇప్పుడు నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. ఈ ఐదుగురు ఫైనాలిస్ట్ ల మధ్య జరిగే ఓటింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసింది. అయితే ఈ ఐదుగురిలో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన నిఖిల్, వైల్డ్ కార్డు ఎంట్రీలో వచ్చిన గౌతమ్ మధ్య రసవత్తరంగా పోటీ సాగింది. బిగ్ బాస్ 8వ సీజన్ లో నిఖిల్ మరియు గౌతమ్ వారి ఆటతో, మాటతో ప్రేక్షకుల మనసు గెలుకున్నారు. దీంతో వారిద్దరిలోనే ఒకరు విన్నర్ మరొకరు రన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ ఫాన్స్ అనుకుంటున్నారు. ఇకపోతే మొదటి నుండి హౌస్ లో నిఖిల్ ఉన్న కారణంగా విన్నర్ అవుతాడని సమాచారం.
గతేడాది బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అలాంటివి జరగకుండా రేవంత్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంది. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అభిమానులు రావొద్దని సూచనలు ఇచ్చారు. అలాగే న్యూసెన్స్ జరగకుండా చూడడం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.