ఫ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్ సంచలనం.. ఇష్టం లేకపోయినా కఠిన నిర్ణయం..!?
ఇకపై అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ విషయంలో కఠినంగా ఉండబోతున్నారట. ఎవరైనా హద్దులు మీరినా..వల్గర్ కామెంట్స్ చేసిన .. తన పేరు చెప్పి వేరే హీరోల అభిమానులని ఇబ్బందులకు గురి చేసినా..తన సినిమా కోసం వేరొక హీరోని ఇబ్బంది పెట్టిన .. హీరోయిన్ ని ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే వాళ్ళ పై సివియర్ యాక్షన్ తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారట. స్వయంగా తన అభిమానులపై తానే కేసు పెట్టే విధంగా కఠినంగా నిర్ణయం తీసుకున్నారట అల్లు అర్జున్ .
కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు మిగతా స్టార్ హీరోస్ కూడా ఇలాగే చేయాలి అంటున్నారు జనాలు. ప్రతి హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ అవసరం అని..ఫ్యాన్ బేస్ ఎంతవరకు ఉంటే అంత మంచిది అని హద్దులు మీరితే ఇలాగే ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది అని కామన్ పీపుల్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. బన్నీ విషయంలో జరిగిన తప్పుకు ముమ్మాటికి కారణం ఫ్యాన్స్ అంటున్నారు జనాలు. ఆరోజు ఫ్యాన్స్ హద్దులు మీరకుండా ఉండి ఉంటే అంత ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఉంటే అల్లు అర్జున్ కి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అంటున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ తీసుకున్న ఈ డెసీషన్ కారణంగా అయినా ఫ్యాన్స్ మారుతారో ..? లేరో..?