ఇది కథ అసలైన న్యూస్.. థియేటర్లు పకలాల్సిందే.. మహేష్ , రాజమౌళి మూవీ నుంచి సర్ప్రైజింగ్ న్యూస్....!

frame ఇది కథ అసలైన న్యూస్.. థియేటర్లు పకలాల్సిందే.. మహేష్ , రాజమౌళి మూవీ నుంచి సర్ప్రైజింగ్ న్యూస్....!

Amruth kumar
బాహుబలి , త్రిబుల్ ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయి సినిమాల‌కు తీసుకువెళ్లాడు.  అలాగే త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ సాధించడంతో హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆయన తర్వాతి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అలాగే ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది .. అయితే ఎప్పుడు తన తర్వాత సినిమా కోసం జక్కన్న రెడీ అవుతున్నాడు .. త్రిబుల్ ఆర్ రిలీజ్ కు ముందే తన తర్వాత మూవీని సూపర్ స్టార్ మహేష్ తో ఉంటుందని ప్రకటించాడు .. ఇక దీంతో వీరిద్దరి కాంబోపై అప్ప‌టి  నుంచి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తర్వాత త్రిబుల్ ఆర్ గ్లోబల్ హీట్ అవ్వడంతో రాజమౌళి , మహేష్ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీసుకురాబోతున్నారు .. ఏడాదికి పైగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి.. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికార ప్రకటన బయటికి రాలేదు .

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి రోజుకు ఒక వార్త ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతూనే ఉంది .. ప్రధానంగా ఈ సినిమాలో నటించే స్టార్ హీరోయిన్ ఎవరైనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది .. ఈ సినిమాలో హాలీవుడ్ అగ్రస్టార్లు కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది .. హాలీవుడ్ మూవీ  ‘థోర్’ ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్ తో పాటు మరికొందరు హాలీవుడ్ నటిమణుల పేర్లు కూడా ఈ సినిమాలు వినిపిస్తున్నాయి .. కానీ ఈ విషయం గురించి అధికార ప్ర‌క‌ట‌న మాత్రం బయటికి రావటం లేదు .. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారట ..

ఈ సినిమాలో హీరోయిన్ కోసం రాజమౌళి చాలా సెర్చ్ చేశాడు .. ఇందులో కథానాయక ఓ అందమైన మలేషియా నటిని ఎంపిక చేశారట .. ఆ తర్వాత మరికొందరి హీరోయిన్లను కూడా ఎంపిక చేయబోతున్నారట .. ఇక చివరిగా ఈ సినిమాలో మహేష్ కు జంటగా ప్రియంకను ఎంపిక చేయబోతున్నారని తెలుస్తుంది .. ఇదే క్రమంలో సినిమాలో మరో హాలీవుడ్ అగ్ర నటిని మెయిన్ హీరోయిన్ గా రాజమౌళి తీసుకోబోతున్నారని కూడా అంటున్నారు .. వీళ్ళిద్దరి కాంబోలో ఈ సినిమా చూస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని కూడా అంటున్నారు .. మరి రాజమౌళి మహేష్ కు జంటగా ఏ హీరోయిన్ ఫిక్స్ చేశారనేది త్వరలోనే బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: