హీరోయిన్ తాప్సి పన్ను ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొన్నాళ్లపాటు రాణించిన తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ స్టార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒక వ్యక్తిని కొన్నేళ్ల నుంచి ప్రేమించి చివరికి ఆయనని పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే మథియాస్.. ఈయనను దాదాపు పది సంవత్సరాలుగా ఆమె ప్రేమించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తిని ఈ ఏడాది కాకుండా, 2023 డిసెంబర్ లోనే తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట. 2024లో మరోసారి అధికారికంగా సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. అయితే తన పెళ్లి విషయాన్ని తాజాగా ఒక ఆంగ్ల వెబ్ సైట్ కు తెలియజేసింది.
గత ఏడాది డిసెంబర్ నెలలోనే దగ్గర కుటుంబ సభ్యుల మధ్య తాప్సి తన బాయ్ ఫ్రెండ్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట. అయితే ఇదే నెలలో ఆమె వివాహ వార్షికోత్సవం కూడా రాబోతోంది.. ఇదే తరుణంలో ఆమె తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. అయితే వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సరైన బ్యాలెన్స్ ఉండాలని మేము అనుకున్నాం. వ్యక్తిగత విషయాలను బయట పెడితే అది మా వర్క్ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మనపై ఒత్తిడి పెరిగి మనం చేసే పనిలో డిస్టర్బ్ అవుతాం అందుకే మా వ్యక్తిగత విషయాలను నేను బయట పెట్టలేదని చెప్పుకొచ్చింది.
నేను డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మీయులు, సన్నిహితుల మధ్య ఉదయ్ పూర్ లో మళ్లీ సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నాను. దీనికి చాలా తక్కువ మందిని ఆహ్వానించానని చెప్పుకొచ్చింది. ఈ విధంగా తాను పోయిన ఏడాది పెళ్లి చేసుకున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు విన్న నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు. పెళ్లి చేసుకొని అంతా చేస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.