తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు ఎవరయ్యా అంటే అందరి చూపు రాజమౌళి వైపే వెళుతుంది. అలాంటి ఈయన తీసిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు ఫ్లాప్ అవ్వలేదు. ఆయన హిట్టవడమే కాకుండా ఆయన సినిమాలో చేసిన నటీనటులంతా స్టార్లుగా మారుతున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా ఎదుగుతూనే ఇండస్ట్రీకి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు రాజమౌళి. అలాంటి రాజమౌళి సినిమా విషయాలు పక్కన పెడితే తన సొంత లైఫ్ లో ఒక చిన్న లవ్ స్టోరీ ఉందట. దాని గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.. మరి ఆయన లవ్ స్టోరీ వెనుక సమంతాకు కూడా సంబంధం ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే రాజమౌళి రానా ది దగ్గుబాటి షోలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు..
అయితే ఆయన ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు భారతీ అనే అమ్మాయిని ప్రేమించానని, కానీ ఆ అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయపడిపోయానని చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఆమెతో మాట్లాడింది ఒకే సందర్భం అని, ఒక టైం లో భారతీ అని పిలవగానే ఆమె నాకోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నట్టు నా వైపు అలా చూసిందని, వెంటనే నేను ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగానని, దీనికి ఆమె ఏం మాట్లాడకుండా తల అడ్డంగా ఊపి వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చారు.
ఆమె నాకోసం ఎంత తపన పడిన నేనే ధైర్యం చేసి నా ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పలేదని చెప్పుకొచ్చారు. భారతీ ఆ టైంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ను నేను నా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారని ఇప్పటికి కూడా మర్చిపోలేదని చెప్పుకొచ్చారు.. అయితే ఆ అమ్మాయి లాగా ఈగ చిత్రంలో సమంతను చూపించే ప్రయత్నం చేశానని, నాని సమంత మధ్య లవ్ సీన్స్ లో ఆ అమ్మాయి ఇచ్చిన హావాబావాలని కొంతవరకు చూపించానని అన్నారు. ఈ విధంగా తన టీనేజ్ లవ్ స్టోరీని ఆయన చెప్పుకొచ్చారు.