అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి బంధువా..?

Divya
అల్లు అర్జున్ అరెస్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయంలో ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ముఖ్యంగా అల్లు కుటుంబం కూడా చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారాయి.. ఆయనేమి ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో పోరాడిన వ్యక్తి కాదు కదా..ఆయన గురించి మాట్లాడాల్సిన పనిలేదు.. అతను ఒక నటుడు మాత్రమే అంటూ తెలిపారు తెలంగాణ సీఎం.. అందరూ న్యాయం ముందు సమానమే వాటిని గౌరవించాలి అంటూ రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పరోక్షంగా ఉంటానన్నట్లుగా చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పినట్టు కనిపించింది.. అయితే ఇలాంటి సందర్భంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కుటుంబం కూడా బాగా తెలుసని తెలియజేసినట్లు తెలుస్తోంది.. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒక వ్యాపారవేత్త.. హైదరాబాదులో సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్గా కూడా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్లో కూడా ఆయన చురుకైన నేతగా ఉన్నారట చంద్రశేఖర్. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత బిఆర్ఎస్ పార్టీలోకి చేరారని ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు సమాచారం.

అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఈ సంఘటనల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు కూడా స్నేహారెడ్డి చాలా ఎమోషనల్ గా కనిపించింది అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతమైతే ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: