తన భార్యని ఏమో జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు.. మరి అందరికి వాళ్ల భార్యలు అలాంటివాళ్లేగా..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు పోలీసుల చేతుల్లో అరెస్టు అయిన ఒక నిందితుడిగా వార్తలు వినిపిస్తున్నాయి
. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ కు పరిమితికి మించిన ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. పుష్ప 2 సినిమాను చూడడానికి చాలామంది ఈగర్ గా వెయిట్ చేసారు. పుష్ప2 రిలీజ్ అవుతుంది అని తెలియగానే చాలామంది జనాలు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు .
అయితే అల్లు అర్జున్ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి భద్రత తీసుకోకుండానే సంధ్యా థియేటర్ కి రావడంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు . అయితే ఈ కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. అల్లు అర్జున్ పై వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కేసు నమోదు అయింది. 105, 118(1)ర్/వ్3(5) యాక్ట్ కింద కేసు నమోదైంది. పోలీసులు ధీయేటర్ యాజమాన్యం కారణమని కూడా ఆరోపించారు అందులో అల్లు అర్జున్ ని కూడా నిందితుడిగా చేర్చారు .
అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు . అసలు అల్లు అర్జున్ కి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లి మరి అరెస్టు చేసి పోలీసుల వాహనంలోనే తీసుకెళ్లడం అందరికీ షాకింగ్ గా అనిపించింది . అయితే చిక్కడపల్లి పోలీసులు బన్నీను అరెస్ట్ చేయడంతో స్నేహారెడ్డి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు . పోలీసులు ఇంటికి రావడంతో టెన్షన్ పడిన స్నేహ రెడ్డి మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు . భార్య భుజం తట్టి ధైర్యం చెప్పి మరి భార్య బుగ్గన ముద్దుపెట్టి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే సంధ్య థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి చేతిని చాలా జాగ్రత్తగా పట్టుకొని అంత మంది జనాల మధ్య ఆమెకి ఏమీ కాకుండా జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది . తన భార్యను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడో అందరి భర్తలు వాళ్ళ భార్యలను అలాగే కాపాడుకుంటూ వస్తారుగా అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తూ బన్నీపై ఇంకా ఘాటుగా ట్రోలింగ్ చేస్తున్నారు..!