ఆ పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారా?

Veldandi Saikiran
టాలీవుడ్‌ అగ్రహీరో, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌  కావడం జరిగింది.  ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.  ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన సంగతి మనందరికీ  తెలిసిందే.
ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం జరిగింది.  ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే.   ఇక ఇవాళ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే.. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే.. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు..అరెస్ట్ చేయడంతో... బన్నీ ఫ్యాన్స్‌ ఆగ్రహిస్తున్నారు.

అల్లు అర్జున్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగింది.  105 , 118 (1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105 సెక్షన్ల నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక ఈ కేసులో బన్నీకి ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. BNS 118(1 )కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు కారణం ఇదేనా..? అంటూ కొత్త అంశం వైరల్‌ గా మారింది.  పుష్ప-2 సక్సెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఈ అరెస్టా..? అంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారు. తన పేరు మర్చిపోవడం, దానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం కారణంగా అరెస్ట్‌ చేసినట్లు బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడంపై..ఆగ్రహానికి గురై సీఎ రేవంత్ ఈ అరెస్ట్ చేయించారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: