లక్ష్మీ నరసింహా : పోలీస్ పాత్రలో బాలయ్య ఉగ్రరూపం.. డైలాగ్స్ అయితే అరాచకం..!!

murali krishna
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించాడు. అలాగే సోలో హీరోగా బాలయ్య ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు.. అయితే టాలీవుడ్ స్టార్ హీరోగా అదరగొడుతున్న బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది.. సంక్రాంతి రోజు తన సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావించేవారు.. దీనితో సంక్రాంతి అంటే బాలయ్య... బాలయ్య అంటే సంక్రాంతి..అనే స్లోగన్ ఎంతో పాపులర్ అయింది..సంక్రాంతికి బాలయ్య పంజా విసురితే ఎలాగుంటుందో నరసింహనాయిడు, సమరసింహారెడ్డి వంటి  బ్లాక్ బస్టర్ సినిమాలు రుచిచూపించాయి. అలా సంక్రాంతి సీజన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ మరో బాలయ్య మూవీ “ లక్ష్మీ నరసింహా “..2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

 

జయంత్ సి. పరాంజి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌‌ మూవీలో  బాలయ్య పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అదరగొట్టేశారు. ఈ సినిమా తమిళ్‌‌లో విక్రమ్ నటించిన సామి సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది..ముందుగా ఈ సినిమాకి వివి వినాయక్, భీమినేని శ్రీనివాస్ రావులను దర్శకులుగా అనుకున్నారు. కానీ ఈశ్వర్ తర్వాత స్టార్ హీరోలతో సినిమాల చేసేందుకు ఎదురుచూస్తున్న దర్శకుడు జయంత్ కి ఈ అవకాశం దక్కింది. పరిచూరి బ్రదర్స్ ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌‌గా ముందుగా శ్రియని అనుకున్నారు. ఆ తర్వాత అసిన్‌‌ని ఫిక్స్ చేసారు.. విలన్‌‌గా ప్రకాష్ రాజ్‌‌ని ఎంపిక చేశారు. ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ నరసింహస్వామి. ఆ తర్వాత పరిచూరి బ్రదర్స్ సూచన మేరకు సినిమా టైటిల్ నీ లక్ష్మీనరసింహాగా మార్చారు.

దాదాపుగా 11 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. 2004 లో వచ్చిన ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ప్లాప్ కావడంతో నందమూరి అభిమానులు అంతా ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. లక్ష్మీనరసింహా ఓపెనింగ్ రోజున అభిమానులు ధియెటర్ల వద్ద భారీ జాతర సృష్టించారు..చేశారు. దీనితో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో అదరగొట్టింది. ఈ సినిమా 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు ఆడింది..టోటల్‌‌గా ఈ సినిమా దాదాపు 17 కోట్ల వరకు  వసూళ్ళు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: