స్టేజ్ పై ఆ మెగా హీరో పరువు తీసిన అల్లు అర్జున్.. మొత్తం పెంట పెంట చేసేసాడే..!?

frame స్టేజ్ పై ఆ మెగా హీరో పరువు తీసిన అల్లు అర్జున్.. మొత్తం పెంట పెంట చేసేసాడే..!?

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ కావాలని చేస్తున్నాడో లేకపోతే అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి బూతు అర్థాలు లేకపోయినా కావాలని ఒక బ్యాచ్ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు నెగిటివ్గా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు తాలూకా వీడియో గబ్బు గబ్బుగా ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు . మనకు తెలిసిందే పుష్ప 2 సినిమా సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది . రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగ రాసింది . భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా పుష్ప2 రికార్డ్స్ నెలకొల్పింది. ఇప్పుడు అప్పుడే ఈ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఏ డైరెక్టర్ ఏ హీరో తరం కాదు అన్న విషయం కూడా తెలుసు. 


రీసెంట్గా ఢిల్లీలో గురువారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు మూవీ టీం. ఈ మీట్లో అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ గా కూడా మాట్లాడారు . పుష్ప2 రికార్డుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు . "సినిమా ఇంత ఘనవిజయం సాధించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. సుకుమార్ విజన్ నుంచి పుట్టిందే ఈ పుష్ప.. అందుకే ఈ రికార్డుల క్రెడిట్ మొత్తం కూడా సుకుమార్ కే సొంతం. సుకుమార్ కే ఫస్ట్ థాంక్స్ చెప్పాలి . కాగా పుష్ప2 పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ ఆదరణకి నిదర్శనమే ఈ వెయ్యి కోట్లు . జస్ట్ ఇది లెక్కలు నెంబర్ మాత్రమే ..ఇవి  తాత్కాలిక రికార్డులు .. ఒక హీరో క్రియేట్ చేయడం మరొక హీరో బద్దలు కొడుతూ ఉండడం జరుగుతూనే ఉంటుంది".


"పుష్ప 2 నెలకొల్పిన ఈ నెంబర్లు రికార్డులు మరో మూడు నెలల్లో ఎవరో ఒకరు బ్రేక్ చేసేస్తారు. ఈ మూడు నెలలు నేను బాగా ఎంజాయ్ చేయాలి సక్సెస్ ని అంటూ చెప్పుకొచ్చారు". దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలను బాగా ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి నటించిన "విశ్వంభర" సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.  అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా కూడా జనవరి 10వ తేదీ రిలీజ్ కాబోతుంది . విశ్వంభర పై ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ గేమ్ చేంజర్ పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . కచ్చితంగా గేమ్ చేంజర్ పుష్ప2 రికార్డులను బద్దలు కొడుతుంది అంటూ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.


అయితే బన్నీ మాత్రం అసలు రాంచరణ్ కి ఆ సత్తా నే లేదు అన్న తరహాలో మాట్లాడాడు అంటూ కొందరు జనాలు బన్నీ మాటల్లోని నెగిటివ్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు . అసలు బన్ని మనసులో అలాంటి ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ.. జనాలు మాత్రం రామ్ చరణ్ ని అవమానించాడు ..రామ్ చరణ్ కి అంత సీన్ లేదన్నాడు ..అందుకే మూడు నెలలు అంటూ టైం కూడా చెప్పాడు అని ..ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో మరొకసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్ పెంచేసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: