పుష్ప2 పై సెటైర్ వేసిన సిద్దార్థ్ !

Seetha Sailaja
‘బొమ్మరిల్లు’ మూవీ విడుదల తరువాత తమిళ హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు క్రేజీ హీరోగా మారిపోయాడు. అయితే ఆతరువాత అతడు నటించిన సినిమాలు చాలమటుకు పరాజయం చెందడంతో సిద్దార్థ క్రేజ్ తెలుగు ప్రేక్షకులలో బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ ఎప్పటికైనా మళ్ళీ తనకి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తుంది అన్న ఉద్దేశ్యంతో అతడు తన సినిమాలను తరుచు తమిళంతో పాటు తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్నాడు.

లేటెస్ట్ గా అతడు నటించిన ‘మిస్ యు’ ఈవారం విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈమూవీ ‘పుష్ప 2’ విడుదలకు ముందే విడుదల కావలసి ఉంది. అయితే ఆమధ్య తమిళనాడును అతలాకుతలం చేసిన భారీ వర్షాలు తుఫాన్ కారణంగా ఈమూవీని వాయిదా వేసి ఇప్పుడు ‘పుష్ప’ మ్యానియాను కూడ లెక్కచేయకుండా తెలుగు తమిళ భాషలలొ ఒకేసారి విడుదల చేస్తున్నారు.

ఈమూవీ కంటెంట్ పై సిద్ధార్థ్ కు ఉన్న నమ్మకంతో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సిద్దార్థ్ చాల బిజీగా ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ తమిళ మీడియా పత్రికకు సిద్ధార్థ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప 2’ విడుదలకు ముందు బీహార్ రాష్ట్రంలో జరిగిన ఆమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లక్షలాది సంఖ్యలో జనం వచ్చారు అని మీడియాలో వచ్చిన వార్తల పై స్పందిస్తూ సిద్ధార్థ్ ఈ కామెంట్స్ చేశాడు..  

మన దేశంలో ఎక్కడైనా భారీ స్థాయిలో కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ సౌండ్ విని జనం గుమిగూడి చూస్తూ ఉంటారని ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద కష్టం కాదని ఒక చిన్న మందు సీసా పలావ్ ప్యాకెట్ ఇస్తే చాలఉ జనం క్షణాలలో వేలాది సంఖ్యలో వస్తారని సినిమా విజయానికి ఒక హీరో నటించిన సినిమా ప్రమోషన్ కు లక్షలాది సంఖ్యలో జనం వస్తే ఆ జనాన్ని చూసుకుని సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశ పడితే అది దురాశ అవుతుందని ఈ యంగ్ హీరో అభిప్రాయ పడుతున్నాడు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: