అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'పుష్ప 2: ది రూల్'. 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కింది. ఎన్నో అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 మూవీ నాలుగు రోజుల్లో రూ. 829 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.ఇక పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీ బెల్ట్ లోనే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండే రూ.800 కోట్లకుపైగా కొల్లగొట్టి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో కేవలం హిందీ వెర్షన్ నుంచే రూ.285 కోట్ల వరకూ వచ్చాయి. తెలుగులో రూ.200 కోట్ల మార్క్ అందుకోవడానికి చేరువైంది. తొలి వారంలోనే రూ.1000 కోట్ల మార్క్ కూడా అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పుష్పరాజ్.. అల్లు అర్జున్ కెరీర్ లో ఐకానిక్ క్యారక్టర్. డైరెక్టర్ సుకుమార్ సృష్టించిన ఈ లార్జర్ దెన్ లైఫ్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్, 'నీ యవ్వ.. తగ్గేదేలే' అంటూ ఒక విధమైన యాటిట్యూడ్ తో అతను చూపించిన మేనరిజానికి అంతా ఫిదా అయ్యారు.
'పుష్ప 1' ఓటీటీలో రిలీజైన తర్వాత పుష్పరాజ్ రీచ్ గ్లోబల్ స్థాయిలో పాకింది. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు ఒక అంగవైకల్యం ఉన్న పాత్రను సూపర్ హీరో మాదిరిగా ఆదరిస్తున్నారంటే, ఆ క్యారక్టర్ జనాల్లో ఎంత బలమైన ముద్ర వేసుకుందనే విషయం అర్థమవుతుంది.పుష్ప పార్ట్-1లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అధ్బుతమైన నటన కనబరిచారు. అదే ఆయనకు పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చిపెట్టింది.. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ ను కూడా సంపాదించి పెట్టింది. దీంతో 'పుష్ప 2' సినిమాలో పుష్పరాజ్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా, మాసీగా డిజైన్ చేశారు సుకుమార్. ఈసారి అల్లు అర్జున్ కూడా తన నట విశ్వరూపాన్ని చూపించారు. మరో జాతీయ అవార్డ్ గ్యారంటీ అనే రేంజ్ లో పర్ఫామెన్స్ చేశారు. జాతర సీన్‌లో ఆడియన్స్ కు ఒళ్ళు జలదరించేలా నటించారు. ఒక కమర్షియల్ సినిమాలో హీరో పాత్ర గురించి ఇంతగా మాట్లాడుకోవడం ఇటీవల కాలంలో జరగలేదు.ఇప్పుడు కేవలం పుష్పరాజ్ పాత్ర కోసమే రిపీటెడ్ గా సినిమా చూస్తున్న ఆడియన్స్ ఉన్నారు. ఇలాంటి ఐకాన్ క్యారక్టర్ బన్నీకి దొరకడం నిజంగా తన అదృష్టమనే అనుకోవాలి. కాకపోతే అతని క్రేజ్ ను కాపాడుకుంటూ, రాబోయే రోజుల్లో అంతకుమించిన పాత్రలు ఎంచుకోవడమే స్టైలిష్ స్టార్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్.మరి బన్నీ తన క్రేజ్ ను కాపాడుకునేలా ఎలాంటి కథలతో వస్తాడో, ఎలాంటి అప్రోచ్ తో ముందుకు వెళ్తారో చూడాలి.