ఇస్మార్ట్ అద్భుతం చేస్తే డబుల్ ఇస్మార్ట్ ముంచేసింది.. పూరీ పరిస్థితి దారుణం!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకుని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. అయితే ఆ సక్సెస్ ట్రాక్ ను పూరీ జగన్నాథ్ కొనసాగిస్తారని ఫ్యాన్స్ భావించగా డబుల్ ఇస్మార్ట్ తో భారీ షాక్ తగిలింది.
 
లైగర్ మూవీతో పూరీ జగన్నాథ్ కు భారీ షాక్ తగలగా ఇస్మార్ట్ శంకర్ తో అంతకు మించిన షాక్ తగిలింది. మరో విధంగా చెప్పాలంటే ఇస్మార్ట్ అద్భుతం చేస్తే డబుల్ ఇస్మార్ట్ ముంచేసింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ దర్శకుడు కొత్త ప్రాజెక్ట్ లను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. చాలామంది హీరోలు పూరీ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు.
 
పూరీ జగన్నాథ్ తో పాటు కెరీర్ ను మొదలుపెట్టిన దర్శకులు ప్రస్తుతం సరైన ఆఫర్లు లేక ఇప్పటికే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ పై సినిమాలను తెరకెక్కిస్తుండగా ఆశించిన స్థాయిలో లాభాలు అయితే రావడం లేదు. బయటి బ్యానర్లలో సైతం పూరీ జగన్నాథ్ కు మూవీ ఆఫర్లు అయితే రావడం లేదనే చెప్పాలి. పూరీ కెరీర్ ప్లాన్స్ ఏ విదంగా ఉండనున్నాయో చూడాలి.
 
పూరీ జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కావాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2025 సంవత్సరం అయినా పూరీ జగన్నాథ్ కు కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ డైరెక్టర్ పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కు 2025 సంవత్సరం అయినా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: