ఈయన విలన్ గా నటిస్తే సినిమా హిట్టే.. పుష్ప-2 విషయంలోనూ ఇదే జరిగింది?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా డైరెక్టర్లు అయితే ఆ సెంటిమెంట్ల విషయంలో అసలు వెనక్కి తగ్గరు. ఫలానా నటుడు తమ సినిమాల్లో నటిస్తే ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని సెంటిమెంట్లు పెట్టుకుంటూ ఉంటారు. దీంతో ఇక ఆ నటుడిని ఏదో ఒక పాత్రలో సినిమాలో ఇరికించడం లాంటిది చేయడం.. ఇప్పటివరకు ఎన్నో సార్లు చూశాము . రాజమౌళి త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఇలా కొంతమంది నటుల విషయంలో సెంటిమెంట్లు పెట్టుకుంటూ ఉంటారు.


 ఇంకొంతమంది డైరెక్టర్లు పలానా తేదీలలో సినిమాలను విడుదల చేస్తే సూపర్ హిట్ సాధిస్తాయని అనుకుంటూ ఉంటాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటుడు అందరూ డైరెక్టర్లకు సెంటిమెంట్ గా మారిపోయాడు. ఎందుకంటే అతను సినిమాలో నటించాడు అంటే చాలు ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్. అది కూడా విలన్ గా నటిస్తేనే సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. ఆ నటుడు ఎవరో కాదు ఇటీవలే పుష్ప 2 సినిమాలో నటించి తన విలనిజంతో అలరించిన తారక్ పొన్నప్ప.


 అయితే ఈయన పేరు చెబితే ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఈయనను చూస్తే మాత్రం ఓహ్ ఇతనేనా అనే భావన కలుగుతుంది. తారక్ పొన్నప్ప స్వతహాగా కన్నడ యాక్టర్. అయితే తెలుగులో కూడా ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయాడు. ఎక్కువగా విలన్ పాత్రలోనే నటిస్తున్నాడు. కేజిఎఫ్ సినిమాలో విలన్గా నటిస్తే ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాలో నటిస్తే ఆ సినిమా విజయం సాధించింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమాలోను బుగ్గారెడ్డి అనే పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: