పుష్ప సినిమాలో.. అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

praveen
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన పుష్ప 2 మూవీ కూడా అంతే పెద్ద విజయాన్ని సాధించింది. మొదట్లో కాస్త నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతుంది ఈ మూవీ. మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అని చెప్పాలి.

 అయితే పుష్ప సినిమాను చూసిన ప్రేక్షకులందరూ అల్లు అర్జున్ నటన ఎలా ఉంది ఆయన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న విషయాన్నే కాదు..  ఈ సినిమాలో పుష్పraaj చిన్నప్పటి క్యారెక్టర్ లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తాడు. పెద్దయిన తర్వాత పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఎలా అయితే కనిపించి మెప్పించాడో ఇక చిన్నప్పుడు పుష్పరాజ్ గా అంతే మెప్పించ గలిగాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్. దీంతో అతను ఎవరు అన్న విషయం తెలుసుకునేందుకు అభిమానులు అందరూ తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.

 అయితే ఈ చిన్నోడు గతంలోనే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అంతేకాదు వాళ్ళ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశాడు. గతంలో పుష్ప వన్ తో పాటు18 పేజీస్, విమానం, ఈగల్, ట్రిపుల్ ఆర్ సహా మరికొన్ని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ప్రస్తుతం విశ్వంభరా, రాబిన్ హుడ్  సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక జైలర్ సినిమాతో పాటు పలు సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి.. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇలా ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా  ఒకవైపు నటనతో ఇంకోవైపు డబ్బింగ్తో దూసుకుపోతున్న దృవన్ ఇక ఫ్యూచర్లో ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: