బుక్ మై షోలో డాకూ మ‌హారాజ్ హ‌వా... బాల‌య్య క్రేజ్ ఇది ..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )
- బాల‌య్య కెరీర్ లో 109 వ సినిమా డాకూ మ‌హారాజ్‌
 - వాల్తేరు వీర‌య్య లాంటి హిట్ త‌ర్వాత బాబి డైరెక్ట్ చేస్తోన్న సినిమా
- బుక్ మై షో లో ల‌క్ష‌కు పైగా ఇంట్ర‌స్ట్ న‌మోదు

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో .. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కే ఎస్ . ర‌వీంద్ర ( కొల్లి బాబీ ) తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ సినిమా “ డాకు మహారాజ్ ”  సినిమా పై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నా యో అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు మాత్ర‌మే కాదు తెలుగు సినీ అభిమానులు అంద‌రూ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమా బాలయ్య 109వ చిత్రంగా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి బుక్ మై షోలో ఎవ్వ‌రూ ఊహించ‌ని రేంజ్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. లేటెస్ట్ గా డాకూ మ‌హారాజ్ సినిమా కు బుక్ మై షోలో లక్ష కి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యింది. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ .. సహా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నా రు.. ఎంత ఆస‌క్తి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కి ఎస్ ఎస్ . థమన్ సంగీతం అందిస్తుండగా .. . నాని జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక‌ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల లోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: